Breaking News

TEAM INDIA

పాక్ ను దెబ్బకొట్టాలనే..

పాక్ ను దెబ్బకొట్టాలనే..

న్యూఢిల్లీ: గత వన్డే ప్రపంచకప్ లో పాకిస్థాన్ అవకాశాలు దెబ్బకొట్టే విధంగా భారత జట్టు ప్రవర్తించిందని ఆ దేశ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ అన్నాడు. పాక్ సెమీస్ కు అర్హత సాధిస్తే.. కోహ్లీసేనకు ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ప్రదర్శనలో తేడా చూపెట్టిందన్నాడు. అందుకే కచ్చితంగా గెలుస్తుందనుకున్న ఇంగ్లండ్ తో మ్యాచ్ లో కావాలని ఓడిపోయిందని విమర్శించాడు. ‘ఇంగ్లండ్ తో లీగ్ మ్యాచ్ లో భారత్ చెత్తగా ఆడింది. వాళ్లు సత్తా మేరకు ఆడితే కచ్చితంగా గెలివాళ్లు. […]

Read More

టీమిండియా క్రికెటర్లకు ట్రైనింగ్​

న్యూఢిల్లీ: భారత క్రికెటర్ల ట్రైనింగ్​పై బీసీసీఐ దృష్టిపెట్టింది. ధర్మశాల లేదా బెంగళూరులోని ఎన్సీఏలో జాతీయ శిక్షణ శిబిరాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే నాలుగు దశల ట్రైనింగ్​ షెడ్యూల్​ను రూపొందించినట్లు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ వెల్లడించాడు. దీంతో నాలుగు నుంచి ఆరు వారాల్లో క్రికెటర్లు పూర్తి ఫిట్​నెస్​ సాధిస్తారని చెప్పాడు. ‘చాలా విరామం తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి వస్తారు. కాబట్టి చాలాఉత్సాహంగా ఉంటారు. అలాంటి సమయంలోనే మనం వాళ్లను సరైన పద్ధతిలో ముందుకు […]

Read More

నేనైతే రివర్స్ స్వింగ్ వేస్తా..

కలకత్తా: బంతిపై ఉమ్మిని రుద్దకుండా నిషేధం విధించినా.. తాను మాత్రం రివర్స్ స్వింగ్ రాబడతానని టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అన్నాడు. కాకపోతే బంతి రంగు మారకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించాడు. ‘ఇందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. చిన్నతనం నుంచి పేసర్లు బంతిపై ఉమ్మి రుద్దేందుకు అలవాటుపడ్డారు. ఇది ఆటలో భాగమైపోయింది. ఒకవేళ నీవు ఫాస్ట్ బౌలర్ కావాలనుకుంటే బంతి రంగు మెరుగపర్చేందుకు ఉమ్మిని రుద్దాల్సిందే. అయితే ఆ బంతి రంగు పోకుండా కాపాడగలిగితే కచ్చితంగా రివర్స్ […]

Read More

ఉమ్మివద్దు కానీ..

న్యూఢిల్లీ: బంతి రంగును మెరుగుపర్చేందుకు ఉమ్మిని నిషేధించడంపై టీమిండియా స్టార్ పేసర్ జస్​ప్రీత్​ బుమ్రా భిన్నంగా స్పందించాడు. ఉమ్మి కాకపోతే మరో ప్రత్యామ్నాయం చూపాలని కోరాడు. బంతిని మెరుగుపర్చకపోతే బౌలర్లకు తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించాడు. ‘వికెట్ తీసిన తర్వాత కౌలిగింతలు, షేక్ హ్యాండ్స్ వద్దంటున్నారు. వ్యక్తిగతంగా నాకూ ఇవి ఇష్టం ఉండదు. కానీ ఉమ్మి విషయంలోనే అసలు సమస్య. ఉమ్మిని ఉపయోగించకుండా బంతిని ఎలా మెరుగుపర్చాలి. దీనికోసం మరో దానిని చూపించాల్సిందే. ఎందుకంటే బంతిని కాపాడుకోకపోతే […]

Read More

ధోనీకి క్రికెట్ అంటే పిచ్చి

చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్​ ధోనీకి క్రికెట్ అంటే పిచ్చి అని అతని భార్య సాక్షి వెల్లడించింది. ఆట గురించి ఎప్పుడూ భావోద్వేగంతో ఉంటాడని చెప్పింది. ఎక్కడున్నా సహచరులకు సాయం చేయడానికి ముందుంటాడని పేర్కొంది. ‘క్రికెట్‌ ఉంటే ధోనీ వేరే విషయాలు పట్టించుకోడు. ఆట అంటే అతనికి అంత ఆసక్తి. ఒకవేళ ఖాళీ దొరికితే వీడియోగేమ్స్‌ ఆడుతుంటాడు. ఒత్తిడిని ఉపశమనం పొందడానికి అది ఓ మార్గంగా భావిస్తాడు. ఇటీవల విరామం రావడంతో పబ్జీ గేమ్ ఆడుతున్నాడు. […]

Read More

టీ20 సిరీస్ ఆడదామా..?

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరిలో జరిగే ఆస్ట్రేలియా పర్యటనలో స్వల్పమార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్​లో జరిగే మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్ ఆడడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సిరీస్ ఆడేందుకు టీమిండియా అంత సుముఖంగా లేదని సమాచారం. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే.. ఆ విండోలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో కేవలం మూడు మ్యాచ్‌ల కోసం ఆసీస్‌కు వెళ్లి […]

Read More

కోహ్లీ @ 180

ముంబై: లాక్​ డౌన్ కారణంగా క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమైనా.. ఫిట్​నెస్​ విషయంలో మాత్రం ఎవరూ తగ్గడం లేదు. తమకు అనువైన ప్రదేశంలోనే, తమకు నచ్చిన రీతిలో ఎక్సర్​సైజ్​లు చేస్తున్నారు. ప్రపంచ క్రికెటర్లలో బెస్ట్ ఫిజిక్, ఫిట్​నెస్ ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కసరత్తులు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడనేది అందరికీ తెలిసిన విషయమే. అత్యుత్తమ దేహాదారుఢ్యం ఆయన సొంతం. దానిని కాపాడుకునేందుకు చాలా శ్రమిస్తాడు కూడా. అతన్ని చూసి చాలా మంది సహచరులు కూడా ఫిట్​నెస్​ మంత్రను […]

Read More

టీమిండియా టూర్​ కు ఇబ్బందుల్లేవ్​

సీఏ చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ కెవిన్​ రాబర్ట్స్​ మెల్‌బోర్న్‌: అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నా.. ఈ ఏడాది చివరిలో జరిగే ఆసీస్​లో ఇండియా పర్యటనకు ఎలాంటి ఇబ్బందుల్లేవని క్రికెట్​ ఆస్ర్టేలియా(సీఏ) చీఫ్​ ఎగ్జిక్యూటివ్​ కెవిన్​ రాబర్ట్స్​ అన్నాడు. ఇప్పుడున్న అనిశ్చితి పరిస్థితులను తొలిగించడానికి అన్ని చర్యలు చేపడతామన్నాడు. ‘ఇప్పటికిప్పుడు భారత్​.. ఆసీస్​కు వస్తుందా? లేదా? అంటే చెప్పలేం. కానీ షెడ్యూల్​ టైమ్​ వరకు కచ్చితంగా పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటన కొనసాగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే మ్యాచ్​ల […]

Read More