సామాజిక సారథి, పెద్దశంకరంపేట: ఉపాధ్యాయులు విద్యాభివృద్ధికి కృషిచేయాలని పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్ అన్నారు. గురుపూజోత్సవం సందర్భంగా ఆదివారం పెద్దశంకరంపేట ఎంపీడీవో ఆఫీసు ఆవరణలో పలువురు ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భావితరాల పౌరులను తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదేనని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ లక్ష్మీరమేష్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు రాములు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దత్తు, రైతుబంధు అధ్యక్షుడు […]
సామజిక సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెదిర కిమ్స్ లా కాలేజ్ లో శనివారం టీచర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రొఫెసర్లకు బొకే ఇచ్చి సన్మానించారు. సమాజంలో న్యాయవాద వృత్తి ఉన్నతమైందని కొనియాడారు. కార్యక్రమంలో లా కాలేజీ అడ్మిన్ రవీంద్ర, ప్రొఫెసర్లు వెంకటస్వామి, కిషన్, కొమురయ్య, రంగయ్య చారి, వేణుగోపాల్‌రావు, తిరుమలేష్, జలంధర్, మౌనిక, శ్రావణి, రజిత పాల్గొన్నారు.
సారథి న్యూస్, బిజినేపల్లి: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన టీచర్లను నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో మంగళవారం డీఈవో గోవిందరాజులు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. మండలంలోని వట్టెం బాలుర ప్రైమరీ స్కూలులో పనిచేస్తున్న ఉపాధ్యాయిని కల్పనను సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈవో కె.భాస్కర్‌రెడ్డి, టీచర్లు ఝాన్సీ, సురేష్ పాల్గొన్నారు.