మారటోరియంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచనలు కరోనా వ్యాప్తి కారణంగా సెప్టెంబర్ 28 వరకు మారటోరియం న్యూఢిల్లీ: రుణ వాయిదాల విషయంలో సామాన్యులకు ఊరట కలిగించేలా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కరోనా వ్యాప్తి కారణంగా ఆర్బీఐ మార్చిలో మూడు నెలల పాటు తాత్కాలిక నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. ఈ సదుపాయాన్ని మార్చి 1 నుంచి మే 31 వరకు మూడు నెలల పాటు అమలు చేశారు. తర్వాత దీనిని ఆగస్టు 31 వరకు మరో మూడు […]
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో వరుసగా షాకులు తగులుతున్నాయి. ఏపీలో పత్రికలకు ప్రకటనలు ఇవ్వడంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, పక్షపాత వైఖరిపై సామాజిక కార్యకర్త నాగశ్రవణ్ వేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. అధికార పార్టీకి చెందిన పత్రికకు 52 శాతం ప్రకటనలు ఇస్తున్నారని నాగశ్రవణ్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. అయితే టీడీపీ నేతలే పిటిషన్ వేయించారని, పిల్‌ను తిరస్కరించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై పిటిషనర్ తరఫున న్యాయవాది దమ్మాలపాటి […]
న్యూఢిల్లీ: ఆడపిల్లలకు ఆస్తిలో వాటా కల్పించడం, హక్కుదారుగా గుర్తించడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు దాఖలైన పిటీషన్లపై విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వినిపించింది. తండ్రి జీవించి ఉన్నా.. లేకపోయినా ఆడపిల్లలకు మాత్రంలో ఆస్తిలో సమానహక్కు ఉంటుందని తేల్చిచెప్పింది. కుమారులతో సమానంగా కుమార్తెలకు ఆస్తిలో వాటా ఉంటుందని, దానిపై హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.చట్టం ఏం చెబుతోందిహిందూ వారసత్వ చట్టం-1956లో సవరణలు చేశారు. సవరణలతో కూడిన చట్టాన్ని 2005 […]