న్యూఢిల్లీ : క్రికెట్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 13 వ సీజన్ ఐపీఎల్ షెడ్యూల్ ఈ నెల 6న(ఆదివారం) విడుదల కానుంది. ఈనెల 19 నుంచి నవంబర్10 మధ్య జరగబోయే ఈ మెగాటోర్నీ దుబాయ్, అబుదాబి, షార్జాలో నిర్వహించనున్నారు. ఈ మేరకు టోర్నీ షెడ్యూల్ ను ఆదివారం విడుదల చేస్తామని ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ తెలిపారు. ఇప్పటికే అన్ని జట్లు దుబాయ్ కు చేరుకుని ప్రాక్టీస్ మొదలెట్టాయి.
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ (84) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కరోనాతో ఈ నెల 10న ఆయన ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరినప్పటినుంచి ప్రణబ్ ఆరోగ్యం విషమంగానే ఉన్నది. ఆయనకు ఊపిరితిత్తుల్లో తీవ్ర ఇన్ఫెక్షన్ అయినట్టు ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయనను కాపాడేందుకు ఎంతో ప్రయత్నించామని చెప్పారు. ఆయన ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి కోమాలోనే ఉన్నారు. ప్రణబ్ మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా, యువనేత […]
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ (84) ఆరోగ్యపరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నది. ఆయన ఆరోగ్యపరిస్థితిలో ఏ మార్పు లేదని.. ప్రణబ్‌కు చికిత్స అందిస్తున్న ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. ఈ నెల 10న ఆర్మీ ఆస్పత్రిలో చేరిన ప్రణబ్‌కు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. దాంతోపాటు ఆయనకు కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. […]
ఢిల్లీ: మనదేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో 63,490 కొత్తకేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 25 లక్షల 89 వేల 682 చేరుకుంది. మరోవైపు ఇప్పటివరకు కరోనాతో 49,980 మంది ప్రాణాలు కొల్పోయారు. 18,62,258 మంది కరోనా నుంచి కోలుకోగా.. 6,77,444 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. కాగా కరోనా, మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత 24 గంటల్లో 944 మంది ప్రాణాలు కోల్పోయారు.