24 మందిపై కేసుల ఎత్తివేత సామాజికసారథి, నాగర్‌కర్నూల్ ప్రతినిధి: నాగర్‌కర్నూల్ జిల్లా పోలీసులు రౌడీ షీటర్లకు గుడ్ చెప్పారు. సత్ర్పవర్తన కింద జిల్లాలో 24 మందిపై రౌడీషీట్‌ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నాగర్‌కర్నూల్ డీఎస్పీ మోహన్‌కుమార్ సోమవారం ప్రకటనలో వెల్లడించారు. కొల్లాపూర్, నాగర్‌కర్నూల్ సబ్ డివిజన్ల పరిధిలో 69 మంది రౌడీషీటర్లను ముఖాముఖిగా పరిశీలించి కౌన్సిలింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ కె.మనోహర్ వారి సంబంధిత వివరాలను సేకరించారు. ప్రస్తుతం చేస్తున్న పనులు, జీవనోపాధి, సామాజిక వ్యవహారాలు, […]
సామాజికసారథి, వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్పీ మనోహర్ మంగళవారం వెల్దండ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఎస్సై నర్సింహులును అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, వాటి సత్వర పరిష్కారం చూసి ప్రశంసించారు. రికార్డులను పరిశీలించి భేష్ అని కితాబు ఇచ్చారు. సీసీ కెమెరాలను ఏర్పాటుకు చూపిన ప్రత్యేక చొరవను చూసి ఎస్సైని ప్రత్యేకంగా అభినందించారు. గార్డెనింగ్, స్టేషన్ ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూసి ప్రశంసలు కురిపించారు. సీసీ కెమెరాలు ఏర్పాటుతో […]