Breaking News

రౌడీషీటర్లకు గుడ్​న్యూస్!​

రౌడీషీటర్లకు గుడ్​న్యూస్!​

24 మందిపై కేసుల ఎత్తివేత

సామాజికసారథి, నాగర్​కర్నూల్ ​ప్రతినిధి: నాగర్​కర్నూల్​ జిల్లా పోలీసులు రౌడీ షీటర్లకు గుడ్​ చెప్పారు. సత్ర్పవర్తన కింద జిల్లాలో 24 మందిపై రౌడీషీట్​ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు నాగర్​కర్నూల్​ డీఎస్పీ మోహన్​కుమార్​ సోమవారం ప్రకటనలో వెల్లడించారు. కొల్లాపూర్, నాగర్​కర్నూల్ సబ్​ డివిజన్ల ​పరిధిలో 69 మంది రౌడీషీటర్లను ముఖాముఖిగా పరిశీలించి కౌన్సిలింగ్ ​నిర్వహించిన జిల్లా ఎస్పీ కె.మనోహర్​ వారి సంబంధిత వివరాలను సేకరించారు. ప్రస్తుతం చేస్తున్న పనులు, జీవనోపాధి, సామాజిక వ్యవహారాలు, ప్రవర్తన వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇలా కొల్లాపూర్ ​సబ్ ​డివిజన్​లో 12 మంది, నాగర్​కర్నూల్​ సబ్​ డివిజన్ ​పరిధిలో 12 మందిపై సత్ర్పవర్తన కింద రౌడీషీట్ కేసులను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్పీ కె.మనోహర్ ​మాట్లాడుతూ.. పరివర్తన చెందారన్న ఉద్దేశంతో కేసులను ఎత్తివేశామని, మళ్లీ పాత ఘటనలు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిగతావారు కూడా సత్ర్పవర్తనను మెరుగుపర్చుకోవాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో సీఐ హనుమంత్​ యాదవ్​ తదితరులు పాల్గొన్నారు. కాగా, కొల్లాపూర్, నాగర్​కర్నూల్​ సబ్​డివిజన్లలో 24 మందిపై రౌడీషీట్లను ఎత్తివేయడంతో వారి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్​ నిర్వహిస్తున్న ఎస్పీ కె.మనోహర్​