సారథి న్యూస్, కల్వకుర్తి: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ ఎ.రేవంత్ రెడ్డి చేపట్టిన రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర నాలుగవ రోజు బుధవారం నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చేరింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. శ్రీశైలం, జూరాల, పులిచింతల, శ్రీరాంసాగర్, కల్వకుర్తి, నెట్టెంపాడు, దుమ్ముగూడెం ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిర్మించారని గుర్తుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు ఎక్కుపెట్టారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ ప్రధాన […]
సారథి న్యూస్, తాడ్వాయి: కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగుపడినట్లు చరిత్రలో లేదని వివరించారు. ప్రధాని మోడీ కార్పొరేట్ కంపెనీలతో కుమ్మక్కయ్యారని వివరించారు. రైతులను దగా చేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం తాడ్వాయి మండల కేంద్రంలో రైతు వ్యతిరేక బిల్లులను నిరసిస్తూ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జలపు అనంతరెడ్డి అధ్యక్షతన సంతకాల సేకరణ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. ఇటీవల […]
సారథి న్యూస్, వాజేడు, ములుగు: యాంత్రిక జీవన విధానంలో అలసిపోతున్న ప్రజలకు మానసిక ఉల్లాసాన్ని పొందేందుకు పల్లె ప్రకృతివనాలు ఎంతో దోహదపడతాయని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్.క్రిష్ణఆదిత్య అన్నారు. సోమవారం ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో నిర్మించిన పల్లె ప్రకృతివనాన్ని కలెక్టర్, ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ(సీతక్క)తో కలిసి ప్రారంభించారు. అన్ని పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాల నిర్మాణాలు తుదిదశకు చేరాయని వివరించారు. సేదదీరడానికి ఏర్పాటుచేసిన బెంచిలో కలెక్టర్, ఎమ్మెల్యేతో పాటు ప్రజాప్రతినిధులు కాసేపు కూర్చుని […]