Breaking News

SINGHRENI

సింగరేణిలో కరోనా కలకలం

సింగరేణిలో కరోనా కలకలం

సారథి న్యూస్, రామగుండం: సింగరేణి ఉద్యోగులు ఎక్కువగా నివసించే పెద్దపల్లి జిల్లా రామగుండంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. కొంతమంది కరోనా పేషేంట్లు విచ్చలవిడిగా జనాల మధ్య తిరుగుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. సింగరేణి యాజమాన్యం పాజిటివ్​ వచ్చినవారి వివరాలు వెల్లడించకపోవడంతో వారు యథేచ్ఛగా తిరుగుతున్నారని స్థానికులు వాపోతున్నారు. కరోనా పాజిటివ్​ వచ్చినవారు క్వారంటైన్​లో ఉండేలా సింగరేణి యాజమాన్యం, వైద్యులు చొరవ తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Read More
సింగరేణి లాక్​డౌన్​

లాక్​డౌన్​ ప్రకటించండి

సారథిన్యూస్​, గోదావరిఖని: సింగరేణిలో లాక్​డౌన్​ ప్రకటించి కార్మికుల ప్రాణాలు కాపాడాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్​ చేశారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ, సింగరేణి కాలరీస్​ ఎంప్లాయీస్​ యూనియన్​, సీఐటీయూ నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సింగరేణిలో కరోనా వైరస్ లక్షణాలతో కార్మికులు చనిపోతున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులు విధులు నిర్వర్తించడానికి ఎంతో భయపడతున్నారని చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ […]

Read More

మమ్మల్ని ఆదుకోండి

సారథిన్యూస్​, గోదావరిఖని: సింగరేణి ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్​ కార్మికులందరికీ స్పెషల్​ ఇన్సెంటివ్​, ప్రత్యేక ప్యాకేజీ చెల్లించాలని యూనియన్​ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు సింగరేణి ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్​కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కడారి సునీల్, రీజియన్ కార్యదర్శి శనిగల శ్రీనివాస్, నగర అధ్యక్షుడు శనిగరపు చంద్రశేఖర్, ఏఐటీయూసీ సింగరేణి ఏరియా ఆసుపత్రి విభాగం ఏఐటీయూసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు దుర్గాప్రసాద్, […]

Read More