Breaking News

SINGARENI

ఘనంగా వీడ్కోలు సన్మాన సభ

ఘనంగా వీడ్కోలు సన్మాన సభ

సామాజికసారథి, మందమర్రి (మంచిర్యాల): మందమర్రి సింగరేణి పర్సనల్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ గ్రేడ్-ఏ విధులు నిర్వహించి బుధవారం పదవి విరమణ పొందిన సీఎస్ కనాన్ ను మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఇన్​చార్జ్​ జీఎం కృష్ణారావు బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1983 లో సింగరేణి సంస్థలో జనరల్ మజ్దూర్ గా మందమర్రి ఏరియా వర్క్ షాపులో ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయికి ఎదిగి క్రమశిక్షణతో, నిబద్ధతతో […]

Read More
గర్భిణిని కాపాడపోయి ఇద్దరు గల్లంతు

గర్భిణిని కాపాడపోయి ఇద్దరు గల్లంతు

వరదలో కొట్టుకుపోయిన ఇద్దరు రెస్క్యూ టీమ్ మెంబర్లు మృతులు రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్ వాసులు సామాజిక సారథి, రామకృష్ణాపూర్: పురిటి నొప్పులతో బాధపడుతున్న సరస్వతి అనే గర్భిణిని ఆస్పత్రికి తరలించే క్రమంలో ఇద్దరు రెస్క్యూ టీమ్ మెంబర్లు వరద నీటిలో గల్లంతయ్యారు. కొమరం భీం అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ దహేగాం మండలంలోని భీబ్రా గ్రామానికి చెందిన నేర్​పల్లి సరస్వతిని ఆస్పత్రికి తరలిస్తుండగా దహేగాం పక్క నుంచి వెళ్తున్న పెద్దవాగు ఉప్పొంగడంతో దహేగాంతో పాటు పెసరికుంట, ఐనం, ఇట్యల, […]

Read More
స్తంభించిన సింగరేణి

స్తంభించిన సింగరేణి

కార్మికుల సమ్మె సక్సెస్​ మూడోరోజూ కొనసాగిన నిరసనలు కార్మిక సంఘాల బైక్​ర్యాలీ నిలిచిన 6లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి బొగ్గు గనులపై కేంద్రం కుట్ర:  ప్రభుత్వ విప్​బాల్క సుమన్​ సామాజిక సారథి, కరీంనగర్‌: బొగ్గుగనుల ప్రైవేటీకీకరణకు వ్యతిరేకంగా చేపట్టిని సింగరేణి సమ్మె సక్సెస్​అయింది. శనివారం మూడో రోజుకు చేరింది. సిగరేణివ్యాప్తంగా కార్మికులు విధులకు హాజరుకాకపోవడంతో ఆరు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. మొత్తం 23 భూగర్భగనులు, 16 ఓపెన్‌ కాస్ట్‌ గనుల్లో సమ్మె విజయవంతమైంది. […]

Read More
9 నుంచి సమ్మె

9నుంచి సమ్మె

బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన సింగరేణి ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు సామాజిక సారథి, భద్రాద్రికొత్తగూడెం: బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 9,10,11 తేదీల్లో జరిగే సమ్మెలో పాల్గొనాలని సింగరేణి కార్మికులకు ఏరియా అఖిలపక్ష కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. టీబీజీకేఎస్‌ నేత కోటా శ్రీనివాస్‌ అధ్యక్షతన ఓసీ2లో జరిగిన ఫిట్‌ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా టీబీజీకేఎస్‌ బ్రాంచి ఉపాధ్యక్షుడు వి.ప్రభాకర్‌రావు, ఏఐటీయూసీ నేత రామ్‌గోపాల్‌, ఐఎన్‌టీయూసీ నాయకుడు వెలగపల్లి జాన్‌, […]

Read More
అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం

సారథి ప్రతినిధి, రామగుండం: సింగరేణి ప్రాంతాల్లో అక్రమ కట్టడాలను తొలిగించేందుకు యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. కాలనీలో కొందరు కార్మికులు ఆక్రమ కట్టడాలు చేపట్టడంతో డ్రైనేజీ, విద్యుత్ సరఫరాపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ మేరకు యాజమాన్యం ఒక కమిటీని నియమించి సింగరరేణి ప్రాంతాల్లోని ఆక్రమ కట్టడాలను గుర్తించి తొలగించేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగాంగా ఆదివారం స్థానిక, పవర్ హౌస్ కాలనీలోని టీ2 123, 124 క్వార్టర్ల వెనక భాగంలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేశారు.

Read More
17న సామూహిక హరితహారం

17న సామూహిక హరితహారం

సారథి న్యూస్, రామగుండం: తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా సింగరేణి యాజమాన్యం ఈనెల 17తేదీన ఒక్కరోజునే రెండులక్షలకు పైగా మొక్కలను సింగరేణివ్యాప్తంగా నాటాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ఏరియాల్లో దీనికోసం సన్నాహాలు చేస్తున్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఎస్‌.చంద్రశేఖర్‌(ఆపరేషన్స్‌,పా) కొత్తగూడెం కార్పొరేట్‌ ఏరియాలో ఎన్‌.బలరాం(ఫైనాన్స్‌, పీ అండ్​ పీ) భూపాలపల్లి ఏరియాలో డి.సత్యనారాయణరావు(ఈఎం) రామగుండం-1 ఏరియాలో పాల్గొననున్నారు. కరోనా జాగ్రత్తలను కచ్చితంగా పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాజమాన్యం కోరింది.

Read More
ఆర్మీ రిక్రూట్​మెంట్​లో 50 మంది ఎంపిక

ఆర్మీ రిక్రూట్​మెంట్​లో 50 మంది ఎంపిక

సారథి న్యూస్, రామగుండం: సింగరేణి ఆర్జీ–1 డివిజన్ పరిధిలోని జవహర్​ లాల్ నెహ్రూ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన ఆర్మీ రిక్రూట్ మెంట్​ టెస్టులో 50 మంది యువకులు ఎంపికయ్యారు. దరఖాస్తు చేసుకున్న 147 మంది అభ్యర్థులకు అన్నిరకాల పరీక్షలు నిర్వహించారు. జీఎం కె.నారాయణ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ఆర్మీ రిక్రూట్​మెంట్​ ర్యాలీని ప్రారంభించారు. ఎంపికైన అభ్యర్థులకు 45 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు జి.దామోదర్ రావు, ఎస్ వో–2 జీఎం […]

Read More
సింగరేణిలో కరోనా వ్యాక్సినేషన్​

సింగరేణిలో కరోనా వ్యాక్సినేషన్​

సారథి న్యూస్, రామగుండం: సింగరేణి ఏరియా హాస్పిటల్ లో డాక్టర్లు, మెడికల్ సిబ్బందికి ప్రభుత్వ వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కరోనా వ్యాక్సినేషన్​ ప్రక్రియను ఆర్​జీ –1 జీఎం కె.నారాయణ మంగళవారం ప్రారంభించారు. మొదటి దఫాలో ప్రభుత్వం సూచన మేరకు సింగరేణి ఏరియా హాస్పిటల్ లో పనిచేస్తున్న వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి వ్యాక్సిన్​ వేశారు.

Read More