Breaking News

SIDDIPET

మేమున్నామని..

మేమున్నామని..

సారథి న్యూస్, హుస్నాబాద్: మృతుడి కుటుంబానికి వాట్సాప్ గ్రూపు సభ్యులు మేమున్నామని చేయూతనిచ్చారు. ఈ సందర్భంగా గ్రూప్ అడ్మిన్ దామెర మల్లేశం మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లా మద్దూర్ మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన బొందుగుల వెంకటయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. సోషల్ మీడియాలో ఒక్కటైన గ్రూప్ సభ్యులు తలకొంత డబ్బులు వేసుకుని 50కిలోల బియ్యాన్ని అందజేశారు. కార్యక్రమంలో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ మల్లేశం, గ్రూప్ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.

Read More
నాలాలను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోండి

నాలాలను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోండి

సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ అన్నారు. ఈ సందర్బంగా శనివారం ఆయన మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు చేర్యాల పట్టణంలోని రోడ్లన్నీ నీటితో నిండిపోయాయన్నారు. రహదారి వెంట అక్రమార్కులు నాలాలను కబ్జా చేయడం ద్వారా డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందన్నారు. మున్సిపల్ అధికారులు, పాలకమండలి సభ్యులు నాలాలను క్లీన్ చేయడం, కబ్జాలకు గురైన స్థలాలను […]

Read More
రాకపోకలకు తాత్కాలిక బ్రేక్​

రాకపోకలకు తాత్కాలిక బ్రేక్​

సారథి న్యూస్, బెజ్జంకి: సిద్దిపేట జిల్లా అల్వాల్ గ్రామ శివారులో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా సిద్దిపేట, అల్వాల్ వైపునకు వెళ్లే రోడ్డును దుబ్బాక సీఐ హరికృష్ణ గౌడ్, మిరుదొడ్డి ఎస్సై శ్రీనివాస్ తాత్కాలికంగా మూసివేశారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పారుతున్నందున ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం గ్రామాల సర్పంచ్​లు, రెవెన్యూ అధికారులతో ప్రతిరోజు మాట్లాడుతున్నామని వివరించారు.

Read More
ప్లాస్మా దానం చేయండి

ప్లాస్మా దానం చేయండి

సారథి న్యూస్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్​ కాలేజీలో కోవిడ్​ టెస్టింగ్ ​ల్యాబ్​ను మంత్రి టి.హరీశ్​రావు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట మున్సిపల్ ఆఫీసు ఆవరణలో కరోనా మొబైల్ టెస్టింగ్ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా కరోనాను జయించినవారు ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు రావాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్​ అధికారులు పాల్గొన్నారు.

Read More
కరోనాకు భయపడకండి

కరోనాకు భయపడకండి

సారథి న్యూస్​, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రిలో కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్ ను తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్​రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా గురించి భయపడకండి.. మానసికంగా కృంగిపోవద్దు. ధైర్యంగా కాపాడాలని సూచించారు. కరోనా వచ్చినవారు ఎవరికీ చెప్పకుండా సొంత వైద్యం చేసుకోవద్దని డాక్టర్ ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ […]

Read More
నాచారుపల్లిలో సంతోషంగా గృహప్రవేశాలు

నాచారుపల్లిలో సంతోషంగా గృహప్రవేశాలు

సారథి న్యూస్​, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా నాచారుపల్లిలో నూతనంగా నిర్మించిన 36 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రవేశాలు శుక్రవారం చేశారు. ముఖ్య​అతిథిగా హాజరైన మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్​ ఆశీస్సులతో డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్లు నిర్మించి ఇచ్చామన్నారు. పేదలకు ఒక్క రూపాయి ఖర్చులేకుండా సకల వసతులతో ఇళ్లు ఇచ్చామన్నారు. ‘గుడిసె తప్ప గూడు ఎరుగని మాకు దేవుడిలా సీఎం కేసీఆర్​ వరం ఇచ్చారని’ లబ్ధిదారులు కొనియాడారు. కార్యక్రమంలో సుడా […]

Read More
కాంగ్రెస్​ నేత సంపత్​ అరెస్ట్​

కాంగ్రెస్​ నేత సంపత్​ అరెస్ట్​

సారథిన్యూస్​, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా వేలూరు గ్రామానికి బయలుదేరిన కాంగ్రెస్​ నేతలను పోలీసులు అరెస్ట్​ చేశారు. వేలూరు గ్రామంలో నర్సింహులు అనే దళిత రైతు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం నర్సింహులు చెందిన 13 గుంటల భూమిని ఇటీవల స్వాధీనం చేసుకున్నదని.. అందుకే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం వేలూరు బయలుదేరిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్​, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిని, కాంగ్రెస్​ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్​ చేశారు. కాంగ్రెస్​ […]

Read More
చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయండి

చేర్యాలను రెవెన్యూ డివిజన్​ చేయండి

సారథి న్యూస్, హుస్నాబాద్: చేర్యాలను రెవెన్యూ డివిజన్​గా ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్​ చేశారు. శనివారం సిద్దిపేట జిల్లా చేర్యాలలో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అన్ని అర్హతలు ఉన్న చేర్యాలను వెంటనే రెవెన్యూ డివిజన్​గా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, చిరంజీవులు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మాజీ జెడ్పీటీసీ కళావతి, బీజేపీ మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఉమారాణి, ఫార్వర్డ్​ బ్లాక్ పార్టీ జిల్లా కార్యదర్శి బీరన్న, […]

Read More