తెలుగు, తమిళ భాషల్లో సమానంగా సినిమాలు చేస్తూ తన కెరీర్ ని బ్యాలెన్స్ చేసుకుంటోంది నివేదా పేతురాజ్. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఓ బిగ్ హిట్ ను తన ఖాతాలో జమచేసుకుంది. రామ్ కు జంటగా తాను నటించిన ‘రెడ్’ విడుదలకు రెడీగా ఉంది. తాజాగా మరో మూవీ తన ఖాతాలో యాడ్ అయింది. రానా, సాయిపల్లవి జంటగా రూపొందుతున్న ‘విరాటపర్వం’లో కీలకపాత్ర పోషిస్తోంది నివేదా. జరీనా వహాబ్, నందితాదాస్, ప్రియమణి, […]
నాగచైతన్య, సాయిపల్లవి పెళ్లి పీటలెక్కారు. ఈ తంతు అంతా వీరిద్దరూ నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమా కోసమేనండోయ్.. మరేది కాదు! ప్రముఖ సినీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే క్యూట్ లవ్ స్టోరీని రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకుని సినిమాలోని స్టిల్ రిలీజ్ చేసింది మూవీ టీమ్. పెళ్లికొడుకు, పెళ్లి కూతురు గెటప్స్‌లో చూడముచ్చటగా ఉన్న చైతూ, సాయిపల్లవి స్టిల్ ఆకట్టుకుంటోంది. […]
నాని హీరోగా ‘టాక్సీవాలా’ మూవీ ఫేమ్ రాహుల్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కలకత్తా నేపథ్యంలో సాగుతుందట. అందుకే సినిమాలో కలకత్తాను చూపించేందుకు ఫిల్మ్‌మేకర్స్ ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ సినిమా కథ ఫాంటసీ మిక్స్ అయి, ఎమోషనల్ గా సాగే పక్కా ఫిక్షనల్ డ్రామాగా ఉంటుందని, అందుకోసం పాత కలకత్తా లుక్ కావాల్సి ఉందని తెలుస్తోంది. కానీ ప్రస్తుతం కలకత్తా వెళ్లినా పాత లుక్ ఉండదు కావునా ఇక్కడే పాతతరం […]
తేజ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందనున్న సినిమా ‘అలమేలుమంగ వెంకటరమణ’ సినిమా గురించి ఓ అప్డేట్ వచ్చింది. నిజానికి గోపీచంద్‌కు నటుడిగా హైప్ ఇచ్చింది తేజానే. కానీ తేజ చిత్రాలైన ‘జయం, నిజం’ లో గోపీచంద్ విలన్ పాత్రలే చేశాడు. మొదటిసారి తేజ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయ్యిందని.. కథకు బలం హీరోనే పాత్రే అని.. ఇది గోపీచంద్‌కు పూర్తిగా సూటయ్యేట్టు తేజ గోపీచంద్ కోసం ఓ యాక్షన్ స్క్రిప్ట్ ను […]
శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వస్తున్న ‘లవ్‌స్టోరీ’ చిత్రంలో తెలంగాణ అమ్మాయిగా కనిపించనున్న సాయిపల్లవి ‘విరాటపర్వం’ సినిమాలో నక్సలైట్‌గా నటిస్తోంది. ఒకదానికొకటి సంబంధం లేకుండా విభిన్న పాత్రల్లో నటించే సాయి పల్లవికి డ్యాన్సర్‌గా కూడా మంచి పేరు ఉంది. ‘ఫిదా’ సినిమాలో ‘మెల్లా మెల్లగ వచ్చిండే’ అన్న పాటకు ఒక రేంజ్లో వేసిన పల్లవి స్టెప్పులకు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారు. ‘సింగిల్ పీస్’ అంటూ భానుమతిగా ఫ్యాన్స్ పిలుచుకునే ఈ హైబ్రిడ్ పిల్లకు శేఖర్ ఇంకో ఆఫర్ ఇచ్చాడట. […]
నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్‌స్టోరీ’ చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగనున్నది. ఫిదా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని శేఖర్‌కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సాయిపల్లవి నటిస్తుండటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. షూటింగ్ లకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో అగష్టు మొదటివారం నుంచి రామోజీఫిల్మ్‌సిటీలో షూటింగ్ జరుగనున్నట్టు సమాచారం. ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నది.
మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ తో వెండితెరకు పరిచయమైంది సాయి పల్లవి. మొదటి సినిమాతోనే క్రేజ్ సంపాదించింది. టాలీవుడ్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ సినిమాతో తెలుగు వాళ్లను ఫిదా చేసేసింది. సాయి పల్లవి అందం, అభినయంతో పాటు మంచి డ్యాన్సర్ కూడా. కమర్షియల్ చిత్రాల్లో ఆఫర్లు వస్తున్నా ప్రతీ ప్రాజెక్ట్‌పై సైన్ చేయకుండా ఆచితూచి సినిమాలను ఎంచుకోవడం ఆమె స్టైల్. అంతేకాదు ఒక ఫెయిర్‌నెస్ యాడ్ కోసం రూ.రెండుకోట్లు ఇస్తానన్నా.. అందులో నిజం లేదని, అలాంటి […]
ఇంద్రగంటి మోహనకృష్ణ డైరెక్షన్ లో ‘వి’ విడుదలకు రెడీ కాగా, వరుస సినిమాలతో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు నాని. శివ నిర్వాణతో ‘టక్ జగదీష్’, ట్యాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో నటించనున్నాడు నాని. వీటితో పాటు వివేక్ ఆత్రేయతోనూ ఒక మూవీ కమిట్ అయ్యాడు. ఇంతలో ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటికొచ్చింది. సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ […]