సారథి న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 1నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 9, 10వ తరగతులకు విద్యార్థులను పంపించేందుకు 60శాతం మంది తల్లిదండ్రులు అంగీకార పత్రాలు అందించారని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో విద్యాశాఖ అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థల పునఃప్రారంభం, ఇతర అంశాలపై అధికారులతో సమీక్షించారు. తరగతి గదిలో విద్యార్థుల మధ్య భౌతికదూరం పాటించాలని మంత్రి సూచించారు. 9వ తరగతిలోపు విద్యార్థులకు డిజిటల్ […]
సారథి న్యూస్, ఇబ్రహీంపట్నం: ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్, ఎలిమినేడు గ్రామాల్లో మొక్కలు నాటి ప్రారంభించారు. తెలంగాణను ఆకుపచ్చగా మార్చేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, కలెక్టర్ అమోయ్ కుమార్, ఇబ్రహీంపట్నం ఎంపీపీ పి.కృపేష్,వైస్ ఎంపీపీ మంచిరెడ్డి ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.
సారథి న్యూస్,హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్లు ఖరారయ్యాయి. మధ్యాహ్నం మూడు గంటల నుంచి www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు చూసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మెమోలు తమ పాఠశాలలో తీసుకోవాలని సూచించారు. పొరపాట్లు ఉంటే పాఠశాల ద్వారా ఎస్‌ఎస్‌సీ బోర్డుకు తెలియజేయాలన్నారు.
సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ రెండూ కలిపి 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. 2.88 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తొలి ఏడాది ఫలితాల్లో బాలికలు పై చేయి సాధించారు. 67.4 శాతం మంది బాలికలు, 52.30 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. 2.83 లక్షల మంది […]