సామాజిక సారథి, భువనగిరి: రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా కలెక్టరేట్ల ముందు ధర్నాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ డ్రామాలకు తెరతీశాయని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రోడ్లపై ధర్నాలు చేపట్టి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం బట్టుగూడెంలో ఏర్పాటుచేసిన ‘బహుజన మేలుకొలుపు’ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఏడేళ్లుగా సీఎం కేసీఆర్ మాయమాటలతో కాలం […]