సారథి, రాయికల్: ఆపద సమయంలో ఓ యువకుడు గొప్ప మనస్సు చాటాడు. రక్తదానం చేసి మానవతను చూపాడు. కరీంనగర్ జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన కంచి సాయన్నకు అత్యవసరంగా ‘ఏ’పాజిటివ్ రక్తం అవసరం కావడంతో దావన్ పల్లి గ్రామానికి చెందిన బీజేపీ ఎస్సీ మోర్చా మండలాధ్యక్షుడు చెలిమెల మల్లేశంను సంప్రదించాడు. సదరు యువకుడు మానవత్వంతో స్పందించి జగిత్యాల హాస్పిటల్ కు వెళ్లి రక్తదానం చేశాడు. ఇప్పటివరకు తాను 11సార్లు రక్తదానం చేసినట్లు చెప్పాడు. ఈ […]
సారథి, రాయికల్: కరోనా ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా వైరస్ నివారణ పరీక్షలు వేగవంతం చేయాలని కరీంనగర్ రాయికల్ మండల మహేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి చిలివేరి నాగరాజు అన్నారు. ప్రతిరోజు చేస్తున్న కరోనా ర్యాపిడ్ నిర్ధారణ పరీక్షలు సంఖ్యను పెంచాలన్నారు. వ్యాక్సిన్ కొరత అధికంగా ఉండటంతో తీవ్రఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వ్యాక్సిన్ వేయించుకోవడానికి మండల సామాజిక ఆరోగ్య కేంద్రానికి పెద్దఎత్తున ప్రజలు రావడంతో అక్కడ ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వైరస్ ఎక్కువ మందికి అంటుకునే ప్రమాదం […]
సారథి, రాయికల్: కరీంనగర్ జిల్లా రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామానికి చెందిన క్యాతం ప్రవీణ్ అనే ప్రైవేట్ టీచర్ కరోనా బారినపడి మృతి చెందాడు. ఆయనకు మూడు రోజులుగా జ్వరం రావడంతో కొవిడ్ ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. వైద్యుల సూచనల మేరకు హోంకారంటైన్ లో ఉండి చికిత్స పొందారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కావడంతో జగిత్యాలలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ లోని ఒక […]
సారథి, రాయికల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అత్యాధునిక సమీకృత మార్కెట్, శ్మశానవాటిక నిర్మాణాలకు సంబంధించిన స్థలాన్ని కరీంనగర్ జిల్లా రాయికల్ పట్టణంలో శనివారం ఏఈ అజయ్ పరిశీలించారు. ఇటీవల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కు రూ.రెండుకోట్లు, శ్మశానవాటిక కు రూ.కోటి నిధులు మంజూరయ్యాయి. నిర్మాణం కోసం పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్తరఫున స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మోర హనుమాండ్లు మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా పనులు మొదలుపెట్టి త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను పబ్లిక్ […]
సారథి, రాయికల్: కరోనా నివారణకు ప్రతిఒక్కరూ టీకాను వేయించుకోవాలని కరీంనగర్ జిల్లా ఎంపీడీవో ఇనుముల రమేష్ కోరారు. శుక్రవారం ఆయన స్థానిక ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకాను వేయించుకున్నారు. 45 ఏళ్లు నిండిన వారు కరోనా టీకా తీసుకోవాలని సూచించారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆస్పత్రికి గాని, కరోనా ర్యాపిడ్ నిర్ధారణ కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. టీకాపై ప్రజల్లో నెలకొన్న అపోహలను వైద్యులు తొలగించాలన్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ పై […]