Breaking News

RAMADUGU

పీవీ చిరస్మరణీయుడు

పీవీ చిరస్మరణీయుడు

సారథి, రామడుగు: దివంగత మాజీ ప్రధాని, భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ నర్సింహారావు చిరస్మరణీయుడని పలువురు నేతలు కొనియాడారు. సోమవారం కరీంనగర్​జిల్లా రామడుగు మండల కేంద్రంలో దివంగత పీవీ నర్సింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సై తాండ్ర వివేక్ పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలు స్మరించుకున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి […]

Read More
ముందు ఇక్కడి సమస్యలు పరిష్కరించు

ముందు ఇక్కడి సమస్యలు పరిష్కరించు

సారథి, రామడుగు: చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నియోజకవర్గ సమస్యలను వదిలి హుజురాబాద్ లో ప్రచారం చేయడం ఏమిటని కాంగ్రెస్ ఇన్​చార్జ్​మేడిపల్లి సత్యం విమర్శించారు. శనివారం కరీంనగర్ ​జిల్లా రామడుగు మండలంలో పలు తూముల నిర్మాణానికి వేసిన శిలాఫలకాలను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. రూ.165కోట్ల వ్యయంతో తూములు నిర్మిస్తామని చెప్పి రెండేళ్లు అవుతున్నా రెండు రూపాయల పనిచేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో యావత్ తెలంగాణకు నీటిని తీసుకుపోవడం బాగానే ఉన్నా […]

Read More
అభివృద్ధి పనులకు శ్రీకారం

అభివృద్ధి పనులకు శ్రీకారం

సారథి, రామడుగు: కరీంనగర్ ​జిల్లా రామడుగు మండలం గోపాల్ రావుపేట్ మార్కెట్ కమిటీ పాలకవర్గ సర్వసభ్యసమావేశం చైర్మన్ గంట్ల వెంకట్ రెడ్డి అధ్యక్షతన బుధవారం మార్కెట్ కమిటీ సమావేశ మందిరంలో జరిగింది. పాలకవర్గ సభ్యులు పలు అభివృద్ధి పనులపై తీర్మానం చేశారు. వీటిలో రైతు విశ్రాంతి భవన నిర్మాణం, ప్రహరీపై పెయింటింగ్, పాత షెడ్ రిపేర్ చేయడం వంటి పలు అంశాలు చర్చించి వాటిని యుద్ధప్రాతిపాదికన పూర్తిచేయాలని తీర్మానించారు. అనంతరం హరితహారంలో భాగంగా మార్కెట్ యార్డ్ ఆవరణలో […]

Read More
కరోనా బాధితులకు సరుకులు పంపిణీ

కరోనా బాధితులకు సరుకులు పంపిణీ

సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా మండలం రుద్రారం గ్రామంలో హెల్పింగ్ హ్యాండ్స్, ధర్మజాగరణ సంస్థ ఆధ్వర్యంలో కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తమ ఉదారత చాటుకున్నారు. చిలుముల జలజ, పర్షిత, సుంకే అనిత, రంగశాయిపల్లి గ్రామానికి చెందిన నిరుపేదలు వేముల జ్యోతి, చిలుముల హన్మయ్యకు బుధవారం కరోనా కిట్స్, నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు గుర్రం దేవిక, ధర్మజాగరణ సంస్థ సమన్వయకర్త పాకాల రాములుగౌడ్, రాజశేఖర్ గౌడ్ తదితరులు […]

Read More
‘హరితహారం’ పట్ల నిర్లక్ష్యం వద్దు

‘హరితహారం’ పట్ల నిర్లక్ష్యం వద్దు

సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామంలో జగిత్యాల ప్రధాన రహదారిపై హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను అడిషనల్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్, డీఆర్డీవో లంకల శ్రీలతరెడ్డి తో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు హరితహారం కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీఓ, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

Read More
పెట్రో ధరలు తగ్గించాలి

పెట్రో ధరలు తగ్గించాలి

సారథి, రామడుగు: పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపుతున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి సృజన్ కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కరీంనగర్ జిల్లా రామడుగు అంబేడ్కర్ చౌరస్తాలో ఎడ్లబండితో నిరసన తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధర కాకుండా అన్నిరకాల నిత్యావసర వస్తువుల ధరలు పెంచి అన్నివర్గాల ప్రజలపై భారం మోపుతున్నారన మండిపడ్డారు. చిరువ్యాపారులు, రైతులపై పెట్రోల్, డీజిల్ […]

Read More
ఈటల చేరిక వేళ స్వీట్ల పంపిణీ

ఈటల చేరిక వేళ స్వీట్ల పంపిణీ

సారథి, రామడుగు: మాజీమంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన సందర్భంగా మంగళవారం స్థానిక ఆ పార్టీ నేతలు స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. మండల కేంద్రంలో బీజేపీ మండలాధ్యక్షుడు ఒంటెల కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మత్స్య సెల్ మండలాధ్యక్షుడు బొజ్జ తిరుపతి స్వీట్లు పంచిపెట్టారు. ఈటల రాజేందర్ రాకతో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎడవెల్లి రామ్, మండల ఉపాధ్యక్షుడు ఎడవెల్లి లక్ష్మణ్, కట్ట రవీందర్, […]

Read More
విత్తన దుకాణాల్లో తనిఖీ

ఎరువుల దుకాణాల్లో తనిఖీలు

సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెంకట్రావుపల్లి, రంగసాయిపల్లి కొక్కరకుంట గ్రామాల్లోని ఎరువులు, విత్తనాల విక్రయ దుకాణాలను మండల వ్యవసాయాధికారి యాస్మిన్ సోమవారం తనిఖీ చేశారు. షాపుల్లో నిల్వ ఉన్న స్టాక్, విత్తనాల లైసెన్సులు, పీసీ స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. డీలర్లు ఎరువులు, విత్తనాలను ఎమ్మార్పీకే విక్రయించాలని సూచించారు. రైతులకు డీలర్ల సంతకంతో కూడిన రసీదు తప్పకుండా ఇవ్వాలని ఆదేశించారు. లైసెన్సు ఉన్న షాపుల్లో మాత్రమే రైతులు ఎరువులు, విత్తనాలు కొనాలని కోరారు.

Read More