సారథి న్యూస్, కర్నూలు: రక్షాబంధన్ సందర్భంగా సోమవారం మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి వైఎస్సార్సీపీ మహిళా నేతలు రాఖీలు కట్టి ఆయన మిఠాయిలు తినిపించారు. రక్షాబంధన్ సోదరిసోదరుల బంధాన్ని తెలియజేస్తుందన్నారు. సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి మహిళలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో భారతి, సుమలత, లలితమ్మ పాల్గొన్నారు.
నేటినుంచే శ్రావణమాసం ప్రారంభం ఈ మాసంలోనే విశిష్ట పర్వదినాలు సన్నటి చిరుజల్లులతో నాన్పుడు వానలు.. అడపాదడపా కుంభవృష్టి.. బోనాల సందడి.. మంగళగౌరీ వ్రతాలు, వరలక్ష్మీ వ్రతాలు, పచ్చగా పసుపు పూసిన పాదాలతో సందడిగా తిరిగే ముత్తయిదువల కళకళ.. అంతటా ఆధ్యాత్మిక వాతావరణం, ప్రకృతి శోభ ఇనుమడించే తరుణమిది…ఇలా ఎన్నో విశిష్టతలు కలిగిన శ్రావణ మాసం ప్రత్యేకతలపై ‘సారథి’ అందిస్తున్న స్పెషల్ స్టోరీ.. శ్రావణ మాసం అంటే శుభమాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు. […]