సారథి న్యూస్ నర్సాపూర్: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజీపేటలో వృద్ధులకు మాస్కులను పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో వృద్ధులకు మాస్కులు పంపిణీ చేస్తున్నట్టు సర్పంచ్ లింగంగౌడ్ తెలిపారు. అనంతరం సర్పంచ్ గ్రామంలో తడి, పొడి చెత్తబుట్టలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది రేణుక, సర్పంచ్ లింగంగౌడ్, ఉపసర్పంచ్ మాధవి తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని రాజీపేట, తిమ్మాపూర్ తో పాటు పలు గ్రామాల్లో తడి, పొడి చెత్తను వేరుచేయడంపై గురువారం మహిళా సంఘాలకు అవగాహన కల్పించారు. సర్పంచ్ లింగంగౌడ్, ఉపసర్పంచ్ మాధవి శివ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కల చొప్పున నాటుకోవాలని సూచించారు. ఇంట్లోనే తడి, పొడి చెత్తను వేరుచేసి చెత్త రిక్షాలు చెత్తను వేయాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరహరి, సీఏలు లావణ్య, […]