సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా పూసల సంఘం సభ్యులు బుధవారం వేములవాడ కమాన్ చౌరస్తాలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ముద్రకోల ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా ముద్రకోల వెంకటేశం, కోశాధికారిగా ముద్రకోల గణేశ్నియమితులయ్యారు. సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడ్ల సమ్మయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాలోని 17 గ్రామాలకు చెందిన 70 మంది పూసల సంఘం సభ్యులు పాల్గొన్నారు.
సారథి, వేములవాడ: కరోనాను వ్యాప్తిని అరికట్టేందుకు రాజన్నసిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే ఆదేశాల మేరకు వేములవాడ రూరల్ఎస్సై మాలకొండ రాయుడు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది హన్మజిపేట గ్రామంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతిఒక్కరూ తప్పకుండా మాస్కులు కట్టుకోవాలని, శానిటైజర్వాడాలని, తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. భౌతికదూరం పాటించాలని మాట, పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
సారథి, వేములవాడ: జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని వేములవాడ టీయూడబ్ల్యూజేహెచ్(143) ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ రఫీ ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులందరికీ కరోనా టెస్టులు చేసి మెరుగైన వైద్యం అందించాలన్నారు కోరారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల అడిషనల్ కలెక్టర్ అంజయ్యకు వినతిపత్రం అందజేశారు. వేములవాడతోపాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు కరోనా వ్యాక్సిన్ వేయాలని విజ్ఞప్తిచేశారు. జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌కార్డులు ఇవ్వాలని డిమాండ్‌చేశారు. ఆయన వెంట ప్రెస్క్లబ్ప్రధాన కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, ఇతర జర్నలిస్టులు […]
సారథి, వేములవాడ: కరోనా పాజిటివ్ వచ్చి హోం క్వారంటైన్ సౌకర్యం లేనివారు తాము ఉండడానికి వీలుగా వేములవాడ పట్టణంలోని లక్ష్మీగణపతి కాంప్లెక్స్, సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని సర్ధాపూర్ వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలో ఏర్పాటుచేసిన ఐసొలేషన్ కేంద్రాల్లో ఉండొచ్చని ఇన్ చార్జ్ జిల్లా వైద్యాధికారి డాక్టర్శ్రీరాములు తెలిపారు. సరైన సదుపాయం ఉన్నవారు ఇంట్లోనే ఉండాలని, హోం క్వారంటైన్ సదుపాయం లేని వారు ఈ ఐసొలేషన్ కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. కొవిడ్ సెకండ్ వేడ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉందని, […]
సారథి, వేములవాడ: కరోనా సెకండ్‌వేవ్ తీవ్రంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. మహమ్మారిపై అవగాహన లేక, ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముందుగానే కొవిడ్ వ్యాక్సిన్తీసుకునే ప్రాణాపాయం నుంచి కొంత బయటపడొచ్చని డాక్టర్లు, వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అందులో భాగంగానే కేంద్రప్రభుత్వం ఆన్ లైన్ పోర్టల్ ను ప్రారంభించింది. ఈ కింద సూచించిన సైట్అడ్రస్లో పేరు, వయస్సు, ఫోన్ నంబర్ తదితర వివరాలను నమోదుచేసి సూచించిన తేదీలో వ్యాక్సిన్‌ను తీసుకొచ్చని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్యాధికారులు […]
సారథి న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో రైల్వేలైన్ ఏర్పాటుకు భూసేకరణ పనులు వేగవంతం చేసి త్వరితగతిన అప్పగించేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ సూచించారు. కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వే లైన్ ట్రాక్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17 గ్రామాల మీదుగా వెళ్తుందని తెలిపారు. ఈ గ్రామాలకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియపై ఆరాతీశారు. దక్షిణకాశీగా పేరుగాంచిన వేములవాడ పట్టణం మీదుగా ఈ ట్రాక్ వస్తుందని తెలిపారు. ఇది భక్తులకు ఎంతో […]