సారథిన్యూస్, కడప: ఏపీలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం అంజద్బాషాకు కరోనా సోకింది. ఆయన గన్ మెన్ కు కూడా కరోనా పాజిటివ్ నమోదైనట్లు సమాచారం. ప్రస్తుతం అంజద్ బాషా హోంక్వారంటైన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. రేపటి నుంచి 28 రోజుల పాటు డిప్యూటీ సీఎం గృహనిర్బందంలో ఉండనున్నారు. ఆయనకు మరోమారు పరీక్షలు నిర్వహించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, పాత్రికేయులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో అంజద్బాషాకు కరోనా పాజిటివ్ […]
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, వైద్యసిబ్బందికి పూర్తివేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ మేరకు అన్ని రాష్ట్రప్రభుత్వాలను, కేంద్రపాలితప్రాంతాలను ఆదేశించాలని కేంద్రానికి సూచించింది. హెల్త్ వర్కర్లకు వసతి కూడా కల్పించాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ అశోక్భూషన్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. కరోనా వ్యాధిగ్రస్థులకు వైద్యం అందించిన డాక్టర్లు, హెల్త్ వర్కర్లను కచ్చితంగా ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచే విధంగా నిబంధనలు తీసుకురావాలని సూచించింది. రాష్ట్రాలు ఈ నిబంధనలు పాటించకపోతే […]