సారథి, రామడుగు: దివంగత మాజీ ప్రధాని, భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ నర్సింహారావు చిరస్మరణీయుడని పలువురు నేతలు కొనియాడారు. సోమవారం కరీంనగర్జిల్లా రామడుగు మండల కేంద్రంలో దివంగత పీవీ నర్సింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సై తాండ్ర వివేక్ పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలు స్మరించుకున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి […]
సారథి న్యూస్, హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు ఈ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని నల్లగొండ ఎంపీ, పీసీసీ చీఫ్ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు. పీవీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో తాను రాష్ట్రపతి భవన్ లో ప్రొటోకాల్ ఆఫీసర్ గా ఉన్నానని గుర్తుచేశారు. ఆ సమయంలోనే తనకు ఆయనతో అనేక విషయాలు చర్చించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. పీవీతో కలిసి విదేశీ పర్యటనలు చేసే అవకాశం వచ్చిందన్నారు. గాంధీభవన్ లో సోమవారం పీవీ నర్సింహారావు […]
సారథి న్యూస్, హైదరాబాద్: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకల నిర్వహణ ఏర్పాట్లను రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శుక్రవారం పరిశీలించారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని పీవీ మెమోరియల్ జ్ఞానభూమిలో ఏర్పాట్లపై అధికారులను అడిగి ఆరాతీశారు.