సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ర్టంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు, జలవనరులు నీటిమయమయ్యాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అధికారులు ఐదువేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ములుగు జిల్లాలోని రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 9.90 మీటర్లకు చేరింది. నదికి సమీపంలోని ఏటూరునాగరం గ్రామంలోని లోతట్టు ప్రాంతాల నుంచి అధికారులు దాదాపు వెయ్యి మందిని తరలించారు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో […]