సారథి న్యూస్, మానవపాడు: తెలంగాణ ప్రైవేట్టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో జోగుళాంబ గద్వాల జిల్లా డీఈవో ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. ఆరునెలల పెండింగ్జీతాలు చెల్లించాలని డిమాండ్చేశారు. కష్టకాలంలో తాము ఎలా బతకాలని ప్రశ్నించారు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలతో ప్రభుత్వం మాట్లాడి తమకు వేతనాలు ఇప్పించాలని కోరారు. జీతాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నామని వాపోయారు.