సారథిన్యూస్, వరంగల్ అర్బన్: వైద్యులతోపాటు జర్నలిస్టులు కూడా ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారని వరంగల్అర్బన్ జిల్లా డీఎంహెచ్‌వో లలిత దేవి పేర్కొన్నారు. పాత్రికేయులు కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తూ తమ విధులను నిర్వర్తించాలని కోరారు. శనివారం వరంగల్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో వరంగల్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి పేరుమాండ్ల వెంకట్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్, […]