న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ (84) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కరోనాతో ఈ నెల 10న ఆయన ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరినప్పటినుంచి ప్రణబ్ ఆరోగ్యం విషమంగానే ఉన్నది. ఆయనకు ఊపిరితిత్తుల్లో తీవ్ర ఇన్ఫెక్షన్ అయినట్టు ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆయనను కాపాడేందుకు ఎంతో ప్రయత్నించామని చెప్పారు. ఆయన ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి కోమాలోనే ఉన్నారు. ప్రణబ్ మృతికి ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా, యువనేత […]
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ (84) ఆరోగ్యపరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నది. ఆయన ఆరోగ్యపరిస్థితిలో ఏ మార్పు లేదని.. ప్రణబ్‌కు చికిత్స అందిస్తున్న ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్ విడుదల చేశాయి. ఈ నెల 10న ఆర్మీ ఆస్పత్రిలో చేరిన ప్రణబ్‌కు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. దాంతోపాటు ఆయనకు కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. […]
ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ కురువృద్ధుడు ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం మరింత విషమించింది. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రణబ్ ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉన్నదని.. ఆయన ప్రస్తుతం ఉపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగిస్తున్నట్టు తెలిపాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం నిశితంగా పరిశీలిస్తుందని వెల్లడించారు. ఈ నెల 10న ప్రణబ్‌ముఖర్జీ అత్యవసర చికిత్స కోసం ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో […]
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్టు ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి సోమవారం ప్రకటన విడుదల చేసింది. కాగా, ప్రణబ్ శరీరం చికిత్సకు కొంతమేర సహకరిస్తున్నదని వారు చెప్పారు. ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 10న ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆయనకు ఓ మేజర్ శస్త్రచికిత్స చేశారు వైద్యులు. తర్వాత ఆయనకు కరోనా కూడా సోకడంతో పరిస్థితి మరింత విషమించింది. ప్రస్తుతం ట్రీట్మెంట్ […]
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ (84) ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నదని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నారని గురువారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉండి చికిత్స పొందుతున్నారు. శరీర అవయవాలన్నీ సక్రమంగానే పనిచేస్తున్నాయని.. గుండె నుంచి శరీర భాగాలకు రక్త సరఫరా సాధారణంగానే ఉందని వివరించారు. ఇటీవల ఆయనకు […]
ఢిల్లీ: కరోనా మహమ్మారి సెలబ్రిటీలను, రాజకీయనాయకులను సైతం వదలడం లేదు. ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులకు, కేంద్ర మంత్రి అమిత్‌షాకు కరోనా సోకగా.. తాజాగా మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్లో వెల్లడించారు. ‘నేను రెగ్యులర్ పరీక్షల్లో భాగంగా కరోనా టెస్టులు చేయించుకోగా నాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత వారంరోజులుగా అన్ని కలిసిన వారంతా దయచేసి పరీక్షలు చేయించుకోండి’ అంటూ ఆయన […]