సారథిన్యూస్, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ హత్యోదంతంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందుకు సంబంధించి శనివారం ఆయన ట్విట్టర్ ద్వారా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. గతేడాది నవంబరు 26న శంషాబాద్ సమీపంలో ఒక వెటర్నరీ డాక్టర్ పై నలుగురు దుండగులు లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా ఆమెపై పెట్రోల్ పోసి అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనానంతరం దేశవ్యాప్తంగా […]
‘మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ‘సర్కార్‌వారిపాట’ చిత్ర యూనిట్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ మోషన్ పోస్టర్లో మహేశ్‌బాబు చేతితో రూపాయి కాయిన్‌ను ఎగరవేస్తూ కనిపిస్తున్నాడు. కేవలం మహేశ్‌బాబు చెయ్యి మాత్రమే కనిపిస్తున్నది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో నిర్మిస్తున్నాయి. కాగా మోషన్ పోస్టర్ చూసి ఫ్యాన్స్ కొంత నిరాశచెందినట్టు సమాచారం. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తుంది. సోషల్ మీడియాలో మహేశ్‌కు […]
యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ విభిన్నకథాంశంతో ‘జోంబీరెడ్డి’ అనే ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శనివారం ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. థ్రిల్లింగ్, హారర్ జోనర్స్ ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినట్టు ప్రశాంత్ తెలిపారు. ప్రశాంత్ వర్మ గతంలో నాని నిర్మాణ సారథ్యంలో ‘అ’ అనే ఓ సినిమాను తీశారు. నిత్యమీనన్, కాజల్ అగర్వాల్, అవసరాల శ్రీనివాస్, రెజినా ముఖ్య పాత్రలు […]