సారథి న్యూస్, నర్సాపూర్: రోడ్డు ప్రమాదంలో వెన్నుపూస విరిగిపోయిన ఓ యువకుడు.. ఏడాది కాలంగా మంచంపైనే నరకయాతన అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం సాయం చేసేవారి కోసం వేయికండ్లతో ఎదురు చూస్తున్నాడు. వైద్యం కోసం అతడి కుటుంబం ఉన్న అరెకరం భూమిని అమ్ముకున్నది. నెలకు 40 వేలు ఖర్చుచేస్తున్నది. ప్రస్తుతం చేతిలో చిల్లిగవ్వ లేక దాతల సాయం కోసం అర్థిస్తున్నది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాజిపేటకు చెందిన దూదేకుల రబియా షాబుద్దీన్ ల ఏకైక కుమారుడు షాదుల్లా (24)కు […]