సామాజిక సారథి, చారకొండ: రెండోసారి ఎమ్మెల్సీ ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిలకు హైదరాబాద్లోని వారి వారి నివాసంలో నాగర్ కర్నూల్ జిల్లా వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్, టీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నకినమోని వెంకటయ్య యాదవ్, చంద్రాయన పల్లి ఎంపీటీసీ గోపిడి శ్రీనివాస్ రెడ్డి వారికి పుచ్ఛగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, కడారి మల్లయ్య, మల్లికార్జున్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
నిన్న నామినేషన్.. నేడు ఎన్నిక రెండవసారి మండలిలోకి ప్రవేశం అభినందించిన టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు సామాజిక సారథి, నిజామాబాద్: సీఎం కేసీఆర్ కూతురు, సిట్టింగ్ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా మళ్లీ పోటీచేసిన ఆమె ఎన్నిక ఏకగ్రీవమైంది. స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంతో ఆమెకు లైన్ క్లియర్ అయింది. మంగళవారం ఆమె నామినేషన్ దాఖలు చేయగా.. ఒక్కరోజు గ్యాప్‌లోనే బుధవారం ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా […]