Breaking News

PEDDASHANKARAMPETA

దళిత సర్పంచ్​పై దాడిచేసిన వారికి శిక్షించాలి

దళిత సర్పంచ్​పై దాడిచేసిన వారిని శిక్షించాలి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: దళిత సర్పంచ్​పై దాడిచేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దళిత బహుజన హక్కుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సంగమేశ్వర్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు తుకారాం, దళిత సంఘాల జేఏసీ నాయకులు విజయ్​కుమార్​ మాట్లాడుతూ.. చిలపల్లి గ్రామంలో దళిత సర్పంచ్​పై దాడిచేయడం హేయమైన చర్య అని అన్నారు. రాష్ట్రంలో దళిత ప్రజాప్రతినిధులపై రాజకీయ నాయకులు దాడిచేస్తుంటే సామాన్యులకు రక్షణ ఎక్కడుందని ప్రశ్నించారు. […]

Read More
‘విమల శతకం’ ఆవిష్కరణ

‘విమల శతకం’ ఆవిష్కరణ

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట గవర్నమెంట్​ హైస్కూలు తెలుగు ఉపాధ్యాయులు శంకరయ్య రాసిన ‘విమల శతకం’ పుస్తకాన్ని బుధవారం డీఈవో రమేష్​ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 108 పద్యాలు నైతిక విలువలకు సంబంధించినవే ఉన్నాయని అన్నారు. యువతను చైతన్యపరచడం, కుటుంబక్షేమం.. వంటి అనేక విషయాలను ఇందులో రాయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో హెచ్​ఎం పోమ్యానాయక్, సెక్టోరియల్ ఆఫీసర్ సుభాష్, నాగేశ్వర్ నాయక్, టీచర్లు రఘునాథ్​, శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.

Read More
అభివృద్ధిని చూసి ఓటేయండి

అభివృద్ధిని చూసి ఓటేయండి

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: తెలంగాణలోని పల్లెల్లో నేడు అభివృద్ధి పనులను చూసి వచ్చే దుబ్బాక ఉపఎన్నికలో టీ‌ఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థికే ఓటు వేయాలని మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట ఎం‌పీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయ రామరాజు కోరారు. మంగళవారం దుబ్బాక నియోజకపరిధిలోని నార్సింగి మండల కేంద్రంలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కొందరు కేవలం ఎన్నికల సమయంలోనే పల్లెలకు వస్తూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. అభ్యర్థి ఎవరైనా టీ‌ఆర్‌ఎస్ బలపర్చిన వారికే ఓటువేసి గెలిపించాలని […]

Read More
లాక్ డౌన్ కు సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు

లాక్ డౌన్ కు సహకరించిన వారికి కృతజ్ఞతలు

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: కరోనా నేపథ్యంలో గతంలో లాక్ డౌన్ కు సహకరించిన ప్రజలు, వ్యాపారులకు మెదక్​ జిల్లా పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, ఎస్సై సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్​లో సమావేశంలో వారు మాట్లాడుతూ.. కొన్నిరోజులుగా కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని, 9 రోజులుగా లాక్ డౌన్ విధించడం వల్ల కరోనా వ్యాప్తి చెందకుండా నివారించగలిగామని అన్నారు. సెప్టెంబర్ 1 నుంచి అన్ని వ్యాపార సంస్థలు యథావిధిగా నడుపుకోవాలని సూచించారు. […]

Read More