సారథిన్యూస్, రామగుండం: సింగరేణిలోని బొగ్గును దొంగిలించనవారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ వీ సత్యనారాయణ పేర్కొన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో సింగరేణిలో తరుచుగా బొగ్గును దొంగిలిస్తున్న దుస్స దేవేందర్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. అనంతరం సదరు నిందితుడిపై కేసునమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: కల్తీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని ఎస్సై దాసు సుధాకర్ హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను మాత్రమే విక్రయించాలని సూచించారు. పురుగు మందుల బిల్లులను రైతులు భద్రంగా దాచిపెట్టాలన్నారు. ఎక్కడైనా నకిలీ ఎరువులు, విత్తనాలను అమ్మినట్లు గుర్తిస్తే డయల్ 100, సిద్దిపేట్ పోలీస్ కమిషనరేట్ 7901100100 వాట్సాప్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి సారథి న్యూస్, హైదరాబాద్: రైతులకు కల్తీ విత్తనాలు అంటగడితే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఆఫీసులో వివిధ జిల్లాల అధ్యక్షులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సమగ్ర వ్యవసాయ ప్రణాళిక అమలులో రైతు సమన్వయ సమితులు కీలకంగా పనిచేయాలని సూచించారు. డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే సాగుచేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర […]