సామాజిక సారథి, హైదరాబాద్: కేబీఆర్ పార్క్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై పోలీసులు దృష్టి సారించారు. ఈ మేరకు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్కు ప్రధాన గేటు వద్ద జీహెచ్‌ఎంసీ, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్, పోలీస్ శాఖల సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. కేబీఆర్ పార్క్ విస్తీర్ణం, పార్కుకు వచ్చే సందర్శకుల భద్రత, ఇతర చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ కొంతకాలంగా పార్క్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను […]
సారథి న్యూస్, రామాయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలోని వివేకానంద యువజనసంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న పార్కుకు శుక్రవారం సర్పంచ్ బాల్ నర్సవ్వ, ఎంపీపీ సిద్ధరాములు శంకుస్థాపన చేశారు. పార్కు లోపల ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి, వార్డు మెంబర్లు, వివేకానంద యూత్ సభ్యులు తదితరులు ఉన్నారు.