జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్ సారథి, రామాయంపేట: ఈ వర్షాకాలంలో వరిపంటనే కాకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటలు పత్తి, పప్పు దినుసులు, నూనెగింజలను సాగు చేయాలని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ పరుశురాం నాయక్ సూచించారు. గురువారం మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో వానాకాలం పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్కువ నీటితో అధిక దిగుబడిని ఇచ్చే ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు […]