సారథి న్యూస్, వనపర్తి: మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మున్సిపాలిటీ సిబ్బందిని సన్మానించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికుల బాధ్యత వెలకట్టలేనిదన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, ఎస్పీ అపూర్వరావు పాల్గొన్నారు.
సారథి న్యూస్, హైదరాబాద్: విత్తనాల కొరత, ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వానాకాలంలో విత్తనాల సరఫరాపై గురువారం రెడ్ హిల్స్ ఉద్యానశిక్షణ కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, క్లస్టర్ల వారీగా ఏయే విత్తనాలు కావాలో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ప్రధాన విత్తన కంపెనీల్లో ప్రతిరోజు సమాచారం సేకరించాలని ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్ధన్ రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ […]
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సారథి న్యూస్,నాగర్ కర్నూల్: అద్భుత తెలంగాణ ఆవిష్కరణకు నూతన వ్యవసాయ విధానాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నియంత్రిత సాగు విధానంపై రైతులకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దశాబ్దకాలం తర్వాత ప్రపంచ వ్యవసాయ చిత్రపటంలో తెలంగాణ ఉంటుందన్నారు. వనపర్తి, నాగర్ కర్నూల్ జిల్లాలో వేరుశనగ నుంచి మంచి […]
మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి సారథి న్యూస్, హైదరాబాద్: రైతులకు కల్తీ విత్తనాలు అంటగడితే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి ఎస్.నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఆఫీసులో వివిధ జిల్లాల అధ్యక్షులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సమగ్ర వ్యవసాయ ప్రణాళిక అమలులో రైతు సమన్వయ సమితులు కీలకంగా పనిచేయాలని సూచించారు. డిమాండ్ ఉన్న పంటలను మాత్రమే సాగుచేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర […]