మహేశ్ అభిమానులకు ‘సర్కార్‌వారిపాట’ చిత్ర యూనిట్ ఓ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వనున్నట్టు సమాచారం. మహేశ్ భర్త్‌డే సందర్భంగా ఈనెల 9న చిత్రయూనిట్ టైటిల్ ట్రాక్‌ను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తున్నది. ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తుండగా తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. కీర్తీ సురేశ్‌తోపాటు , మరో కథానాయిక కూడా మహేశ్‌తో ఆడిపాడనున్నది. దీంతో పాటు మహేశ్ భర్త్‌డే సందర్భంగా ఎస్ఎస్ రాజమౌళితో చేయబోయే చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం.
సావిత్రి ఫేమ్ నాగ్అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వైజయంతి సంస్థ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణే నటించనున్నది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ ట్విట్టర్లో తెలియజేశాడు. టాలీవుడ్లో దీపికా తొలిసారి నటిస్తున్నారు. ‘రాజు స్థాయికి సరిపోయే రాణిని తేవాలి కదా, అందుకే చాలా ఆలోచించి దీపికాను ఎంపికచేశాం. ఇక పిచ్చెక్కిద్దాం’ అంటూ నాగ్అశ్విన్ ట్వీట్ చేశారు. ఈ […]
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఆర్జీవీ ఆలోచనలు ఎవరి అంచనాలకు దొరకవు. కొత్తగా ఆలోచించడంలో ఆయన తర్వాతే ఎవరైనా.. అందుకే ఇన్నేళ్లయినా.. ఎన్ని ప్లాపులు వస్తున్నా ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ‘పవర్‌స్టార్’ అనే ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా ఎవరిగురించి తీస్తున్నాడో ఎల్కేజీ పిల్లవాడిని అడిగినా చెప్తారు. ఆ చిత్రానికి సంబంధించి త్వరలో ఓ ట్రయిలర్ రిలీజ్ చేయబోతున్నాడు. కాగా ఈ ట్రయిలర్కూ కూడా రూ.25 టికెట్టు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు […]
రమేశ్‌వర్మ దర్శకత్వంలో రవితేజ నటించనున్న చిత్రంలో రాశీఖన్నా స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో రాశీ ఓ రేంజ్లో అందాలను ఆరబోయనున్నట్టు ఫిలింనగర్ టాక్. రవితేజ ‘క్రాక్’ తర్వాత ఈ చిత్రంలో నటించనున్నాడు. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ పోషిస్తుండగా నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. ఇకపోతే ప్రస్తుతం రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తోన్న ‘క్రాక్’ సినిమా రవితేజకు పూర్వవైభవాన్ని తీసుకొస్తోందట. ఈ చిత్రాన్ని కరోనా […]
ఇండియన్2, పుష్ప చిత్రాల్లో తాను స్పెషల్సాంగ్స్ చేయడం లేదని ఆర్ఎక్స్100 ఫేమ్ పాయల్ రాజ్‌పుత్ స్పష్టం చేశారు. తాను ఆ రెండు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తున్నానంటూ కొందరు పుకార్లు పుట్టించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సోషల్‌మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘ప్రస్తుతం నేను కొన్ని కథలు వింటున్నాను. కథ నచ్చితే సినిమా చేస్తాను. ఆ విషయాన్ని స్వయంగా నేనే ప్రకటిస్తాను. కాబట్టి అప్పటివరకు నా మీద అనవసర పుకార్లు పుట్టించి మీ సమయం వృథా […]
ఆర్జీవీ శిష్యుడు, మొదటి సినిమాతోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ర్టీలో ప్రకంపనలు సృష్టించిన అజయ్ భూపతి కొత్త చిత్రం మహాసముద్రంలో యువనటుడు శర్వానంద్ హీరోగా చాన్స్ కొట్టేశాడు. మహాసముద్రం స్ర్కిప్ట్ ఎప్పుడో పూర్తయినప్పటికీ.. పలు కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోతూ వస్తున్నది. తాజాగా శర్వానంద్ ఈ సినిమాలో నటించనున్నట్టు సమాచారం. కాగా హీరోయిన్గా రాశీఖన్నా ఎంపికైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కరోనా పరిస్థితులు ఓ కొలిక్కిరాగానే సినిమాని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, […]
రాజకీయ జీవితానికి తాత్కాలికంగా గ్యాప్ ఇస్తూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలతో బిజీ అయ్యారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారన్న విషయం తెలిసిందే. ఈ సినిమా పనులు శరవేగంగా పూర్తి అవుతున్నాయి. తర్వాత ఆయన డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘విరూపాక్ష’ సినిమా చెయ్యనున్నారు. అయితే పవన్ సినిమాలకు రీ ఎంట్రీ ఇవ్వగానే పండుగ చేసుకున్న ఫ్యాన్స్ ఇప్పుడీ వార్త విని కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. అదేమంటే […]
రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రానికి తమిళ యువ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ బాణీలు అందిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రభాకరన్ ఈ చిత్రం కోసం కొన్ని ట్యూన్స్ సిద్ధం చేసినట్టు టాక్. ప్రభాస్ 20వ చిత్రం ఇప్పటికే ప్రారంభమైనా దానికి సంబంధించిన ఎటువంటి వివరాలు బయటకు తెలియడం లేదు. దీంతో యంగ్ రెబల్ స్టార్ అభిమానులు ఒకింత నిరాశలో ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువగా విదేశాల్లో జరుగడం ఇందుకు కారణమని చిత్ర యూనిట్ చెబుతున్నది. […]