సారథి న్యూస్, పెద్దశంకరంపేట: బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుని ఎదగాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నారాయణఖేడ్ క్యాంపు కార్యాలయంలో పెద్దశంకరంపేట మండలంలోని మార్కెట్ పల్లి గ్రామానికి చెందిన యాదగిరికి ఆస్పత్రి ఖర్చుల కోసం రూ.15వేల సీఎం సహాయనిధి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విజయరామరాజు, సర్పంచ్ రమ్యఅశోక్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు దత్తు తదితరులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, కంగ్టి, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని చాప్టా(కే)గ్రామంలో నూతనంగా నిర్మించిన బారడీ పోచమ్మ ఆలయంలో సోమవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మధ్యాహ్నం విగ్రహాన్ని ప్రతిష్టించి నైవేద్యం పెట్టి, సాయంత్రం బోనాలు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఎడ్ల బండ్లను ముస్తాబుచేసి ఊరేగింపుగా ఊరు శివారులో ఉన్న బారడీ పోచమ్మ మందిరం వరకు తీసుకెళ్లి ప్రదక్షిణలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం అన్నదానం ఉంటుందని, భక్తులు తరలొచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు.
సారథి న్యూస్, నారాయణఖేడ్, కంగ్టి: ప్రమాదాలకు నిలయంగా ఇంటిపై వేలాడుతున్న వైర్లను తొలగించాలని, సంబంధిత కరెంట్ ఆఫీసర్లకు విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదని సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం దెగుల్ వాడీ గ్రామస్తులు ఆదివారం మండల కేంద్రంలోని విద్యుత్‌సబ్ స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. స్తంభాల కింద వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని ఏఈ మోతిరాంకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని సర్పంచ్ చంద్రవ్వ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా […]
సారథి న్యూస్, నారాయణఖేడ్, కంగ్టి: ఆడపడుచుల ఆత్మ గౌరవం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బాత్ రూంల నిర్మాణంలో భారీస్థాయిలో గోల్ మాల్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామానికి మంజూరైన బాత్ రూంలు ఇష్టారీతిలో నిర్మించి రూ.లక్షల్లో బిల్లులు స్వాహాచేసినట్లు ఉన్నతాధికారులకు తడ్కల్ గ్రామానికి చెందిన సోలంకార్ రాజు ఫిర్యాదు చేశాడు. బాత్ రూంల నిర్మాణంలో అవినీతికి పాల్పడిన సెక్రటరీలు, వారికి సపోర్టుచేసిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని గతంలో మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు […]
సారథి న్యూస్, కంగ్టి: నీటి కుంటలో పడి చిన్నారి మృతిచెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ కంగ్టి మండలంలోని చాప్టా(కే)గ్రామంలో చోటు చేసుకుంది. కురుమ గాయత్రి(8) తల్లితో కలిసివెళ్లి శనివారం ఉదయం బట్టలు ఉతకడానికి గ్రామ శివారులోని నీటి కుంటలోకి దిగి బట్టలు ఉతుకుతున్న సమయంలో కాలు జారీ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయింది. కూతురు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లి చూడగానే శ్వాస ఆడక కొట్టుమిట్టాడుతున్న బిడ్డను చూసి సృహకోల్పోయింది. నీటిలో మునిగిన బిడ్డను బయటికి […]
ముసురు వానకు పెసర పంటకు తీవ్ర నష్టం ‘ఖేడ్’ డివిజన్ లో 12,446 ఎకరాల్లో సాగు 9,541 ఎకరాల్లో నష్టపోయినట్లు గుర్తించిన అధికారులు సారథి న్యూస్, కంగ్టి(సంగారెడ్డి): పదిహేను రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన ముసురు వానలకు నారాయణఖేడ్ డివిజన్ పరిధిలో పెసర పంట ఆగమైంది. చేతికొచ్చిన పంట నీట మునగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. నిరుడు కంటే ఈ యేడు పెసర కాయ బాగా కాయడంతో సంతోషించిన రైతులు పంట నీటిపాలు కావడంతో ఆవేదన చెందుతున్నారు. […]
సారథి న్యూస్, నారాయణఖేడ్: అయోధ్య రామమందిరం భూమి పూజ ప్రోగ్రాంలో రాష్ట్రం నుంచి పిలుపును అందుకున్న ఏకైక వ్యక్తి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్ మహారాజ్. భూమి పూజ అనంతరం ఆశ్రమానికి చేరుకున్న ఆయనను శనివారం నారాణయఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి కలిశారు. ఆశీస్సులు తీసుకుని శాలువాతో ఘనంగా సన్మానించారు. అయోధ్య వెళ్లొచ్చి నారాయణఖేడ్ కీర్తిని పెంచారని కొనియాడారు. తర్వాత స్థానిక హనుమాన్ మందిరంలో ప్రత్యేకపూజలు చేశారు. హైందవ సంస్కృతి […]
సారథి న్యూస్, నారాయణఖేడ్: వానాకాలంలో ఎరువులు, విత్తనాల కోసం ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ప్రభుత్వం ఓ వైపు చెబుతున్నా.. రైతన్నలకు మాత్రం అవస్థలు తప్పడం లేదు. నిన్న మొన్న వరుసగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం ఫర్టిలైజర్ షాపులు, అగ్రికల్చర్ ఆఫీసుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంతో పాటు తడ్కల్ గ్రామంలో ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ సోయాబీన్ విత్తనాల కోసం […]