న్యూఢిల్లీ: సినిమాలు, టీవీ సీరియల్స్ షూటింగ్‌లకు కేంద్రప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అన్‌లాక్ 3.0 మార్గదర్శకాల్లో భాగంగా షూటింగ్‌లకు అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఉదయం కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మార్గదర్శకాలను విడుదల చేశారు. బహిరంగ ప్రదేశాల్లో యూనిట్ సిబ్బంది తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని నిబంధనల్లో సూచించారు. నటీనటిలంతా ఆరోగ్యసేతు యాప్‌ను ఉపయోగించాలని.. షూటింగ్ సమయంలో విజిటర్లను అనుమతించవద్దని సూచించారు. మేకప్ సిబ్బంది కచ్చితంగా పీపీఈ కిట్లు ధరించాలని సూచించారు. వీటితోపాటు చిత్రీకరణ […]
నెపొటిజం వివాదం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు కరీనా కపూర్‌కు చుట్టుకుంది. బైకాట్ కరీనా కపూర్ అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాష్‌ట్యాగ్‌లు హోరెత్తుతున్నాయి. కరీనాకపూర్ సినిమాలను చూడొద్దంటూ నెట్‌జన్లు పిలుపునిస్తున్నారు. ఇందుకు కారణమేమిటంటే.. సుశాంత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లో నెపొటిజం తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు సినీతారలు కూడా బాలీవుడ్లో బంధుప్రీతి ఉన్నదని ఒప్పుకున్నారు. కంగనా లాంటి హీరోయిన్లు ఈ ఉద్యమానికి మద్దతిచ్చారు కూడా. ఈ నేపథ్యంలో కరీనా ఓ […]
సారథిన్యూస్, హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు, వైసీపీ నేత పృథ్విరాజ్‌కు కరోనా అంటుకుంది. పదిరోజుల నుంచి ఆయన తీవ్రజ్వరం, జలుబుతో బాధపడుతున్నారు. దీంతో వైద్యుల సూచనమేరకు పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. వైద్యుల సూచన మేరకు తాను 15 రోజులు క్వారంటైన్లో ఉంటానని చెప్పారు.
హస్యబ్రహ్మ.. బ్రహ్మానందం ఇక సినిమాలు చాలించుకొని.. టీవీ షోల్లో నటించనున్నారని ఫిలింనగర్లో జోరుగా టాక్ నడుస్తోంది. కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రిసెంట్‌గా అలవెకుంఠపురంలో ఓ పాటలో కొన్ని క్షణాల పాటు దర్శనమిచ్చాడు. సినిమాల్లో నటించకపోయినా.. యువత సోషల్‌మీడియాలో అన్ని మేమ్స్లోనూ బ్రహ్మానందం ఫొటోలే దర్శనమిస్తాయంటే ఆయనకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కాగా ఆయన ఇకపై సినిమాల్లో నటించకూడదని గట్టిగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. టాలీవుడ్లో కొత్త కమెడియన్స్ హవా నడుస్తోంది. […]