సారథి న్యూస్, రామగుండం: వ్యవసాయ రంగానికి సాగునీరు అందించే మహాసంకల్పంతో మఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన అపర భగీరథ ప్రయత్నం సఫలం కావడంతో గోదావరికి జలకళ సంతరించుకుందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి నదీతీరాన్ని పర్యాటక హబ్‌గా మార్చనున్నట్లు ప్రకటించారు. ఆదివారం గోదావరి నది వద్ద అడ్వంచర్ అండ్ అక్వా, టూరిజం డెవలప్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బోట్ డ్రైవింగ్, లైఫ్ గార్డ్, రెస్క్యూ ఆపరేషన్ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. సమైక్యపాలనలో […]
సారథి న్యూస్, రామగుండం: ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా కరోనా బారినపడుతున్నారు. తాజాగా, పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కు పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రి చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం హైదరాబాద్ నుంచి ఒక ప్రత్యేక వీడియోను రామగుండం ప్రజల కోసం విడుదల చేశారు. కరోనా మహమ్మారి పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కోరుకంటి కోరారు.