సారథి ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన బొలిశెట్టి రాజేష్ కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.3.5 లక్షల చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావా వసంత కలిసి గురువారం పంపిణీ చేశారు. అనంతరం జగిత్యాల రూరల్ మండలం చలిగల్ క్లస్టర్ గ్రామ రైతువేదికను ప్రారంభించారు. ఇటీవల మొరపల్లి గ్రామానికి చెందిన రైతు ఎడమల నాగరాజు మరణించగా వారి కుటుంబసభ్యులకు రూ.ఐదులక్షల రైతుబీమా చెక్కును అందజేశారు. అనంతరం […]
సారథి ప్రతినిధి, జగిత్యాల: రెండవ విడత గొర్రెల పంపిణీకి సీఎం కేసీఆర్ రూ.6వేల కోట్లు కేటాయించినందుకు జగిత్యాల జిల్లా కురుమ సంఘ నాయకులు ఎమ్మెల్యే క్వార్టర్ లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను గురువారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు వొళ్లెం మల్లేశం, పట్టణాధ్యక్షుడు పుల్ల గంగారాం, ప్రధాన కార్యదర్శి పుల్ల మహేష్, చెట్టె రమేష్, సాయిల్ల మురళి, బండారి మల్లేశ్, […]
సారథి, జగిత్యాల: జగిత్యాల మండలం వెల్దుర్తి గ్రామం బావాజీపల్లికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త కె.రామకృష్ణ అనారోగ్యం చనిపోయారు. అలాగే వెల్దుర్తి గ్రామానికి కండ్లే గౌతమ్ గుండెపోటుతో మరణించగా వారి కుటుంబసభ్యులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శనివారం పరామర్శించారు. అలాగే జగిత్యాల రూరల్ మండల జాబితాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త నాంసాని సాయి తండ్రి రాజన్న ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మాజీ ఎంపీటీసీ సుగుణ తండ్రి భారత దావీదు అనారోగ్యంతో మరణించగా వారి […]
సారథి, జగిత్యాల: ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 సందర్భంగా జగిత్యాల జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మొక్కలు నాటారు. ప్రతిఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కంకరణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ జి.రవి, ఎస్పీ సింధూశర్మ, డీఎఫ్ వో వెంకటేశ్వర్లు, స్థానిక కౌన్సిలర్ ఒద్ది శ్రీలత రామ్మోహన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సారథి, జగిత్యాల: జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్ గ్రామ శివారులో పెద్దమ్మ తల్లి మ్యాంగో సెంటర్ లో కడార్ల రాజేశ్వర్ ఆధ్వర్యంలో వలస కార్మికులకు గురువారం రూ.50వేల విలువైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంపీటీసీ మల్లారెడ్డి, కౌన్సిలర్లు పంబాల రామ్ కుమార్, కుసరి అనిల్, పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు ఆనంద్ రావు, ఏఎంసీ డైరెక్టర్ మోహన్ రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు.
సారథి, జగిత్యాల రూరల్: జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కట్టె గానుగ ద్వారా నూనె తయారీ కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శ్రీనిధి, బ్యాంకుల ద్వారా లోన్లు ఇస్తూ ఆర్థికంగా అండగా ఉంటుందన్నారు. జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ […]