సారథి న్యూస్, హైదరాబాద్: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి ఇటీవల కన్నుమూశారు. బుధవారం మాక్లూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో నిర్వహించిన ద్వాదశ దినకర్మలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. రోడ్డు మార్గం ద్వారా ఆయన అక్కడికి నేరుగా వెళ్లి ఎమ్మెల్యే గణేష్ గుప్తా కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. అంతకుముందు కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం వెంట హోంశాఖ మంత్రి మహమూద్అలీ, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, […]