సారథి, వడ్డేపల్లి(మానవపాడు): అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహంకు వైద్యారోగ్యశాఖ మంత్రి పదవి ఇస్తే తెలంగాణలో మాదిగ సామాజికవర్గానికి న్యాయం చేసినట్లు అవుతుందని దళిత ప్రజాప్రతినిధుల మనవి వడ్డేపల్లి జడ్పీటీసీ సభ్యుడు కాశపోగు రాజు కోరారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అబ్రహం వృత్తి రీత్యా డాక్టర్ కావడంతో ఆరోగ్యశాఖను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందన్నారు. గతంలో నియోజకవర్గంలో ఎవరికీ రాని మెజార్టీ డాక్టర్అబ్రహంకు వచ్చిందని తెలిపారు. ప్రజాభిమానాన్ని చూరగొన్న నేతగా ఆయన వైద్యాశాఖ మంత్రి పదవికి […]
సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: అన్నిశాఖల అధికారుల సమన్వయంతో తుంగభద్ర నది పుష్కరాలను సక్సెస్ చేయాలని అలంపూర్ ఎమ్మెల్యే వీఎం అబ్రహం సూచించారు. గురువారం ఆయన జోగుళాంబ గద్వాల కలెక్టరేట్లో కలెక్టర్ శృతిఓజా, ఎస్పీ రంజన్రతన్ కుమార్తో కలిసి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఘాట్స్ వద్ద ఐమాక్స్ లైటింగ్ సిస్టం, మొబైల్ టాయిలెట్స్, ఆర్డబ్ల్యూఎస్శాఖ వారి ఆధ్వర్యంలో శుద్ధమైన నీటిని ఏర్పాటు చేయాలని, బ్లీచింగ్ పౌడర్ చల్లాలని, అవసరమైన చోట వలంటీర్లను నియమించాలని […]
సారథి న్యూస్, మానవపాడు: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని నారాయణపురం, మద్దూరు, కలుగొట్లలో రైతు వేదిక భవనాలను బుధవారం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహం ప్రారంభించారు. రైతుల అభ్యున్నతి కోసమే రైతు వేదికలను నిర్మిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 60లక్షల రైతు కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. రైతు వేదికల వద్ద రైతాంగం సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు. అన్నదాతల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ సరిత, కలెక్టర్ శృతిఓజా, సర్పంచ్ లక్ష్మీదేవి, […]
సారథి న్యూస్, అలంపూర్: నవంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తుంగభద్ర పుష్కరాలు విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించాలని కోరుతూ జిల్లా బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షుడు మోహన్ రావు, ప్రధాన కార్యదర్శి దిండిగల్ ఆనంద్ శర్మ ఎమ్మెల్యే అబ్రహంకు వినతిపత్రం సమర్పించారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యేను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మోహన్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తుంగభద్ర నది ప్రవహించేది ఒక […]