
సారథి, వడ్డేపల్లి(మానవపాడు): అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహంకు వైద్యారోగ్యశాఖ మంత్రి పదవి ఇస్తే తెలంగాణలో మాదిగ సామాజికవర్గానికి న్యాయం చేసినట్లు అవుతుందని దళిత ప్రజాప్రతినిధుల మనవి వడ్డేపల్లి జడ్పీటీసీ సభ్యుడు కాశపోగు రాజు కోరారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అబ్రహం వృత్తి రీత్యా డాక్టర్ కావడంతో ఆరోగ్యశాఖను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశం ఉంటుందన్నారు. గతంలో నియోజకవర్గంలో ఎవరికీ రాని మెజార్టీ డాక్టర్అబ్రహంకు వచ్చిందని తెలిపారు. ప్రజాభిమానాన్ని చూరగొన్న నేతగా ఆయన వైద్యాశాఖ మంత్రి పదవికి అన్ని విధాలుగా అర్హత ఉందన్నారు.