న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. బుధవారం నాటికి కేసుల సంఖ్య 2,76,583కి చేరింది. వారం నుంచి రోజుకు దాదాపు 10 వేల కేసులు నమోదవుతున్నాయి. మరో పదకొండు వేల కేసులు నమోదైతే మన దేశం కరోనా కేసుల్లో ప్రపంచవ్యాప్తంగా నాలుగోస్థానానికి వెళ్లనున్నది. త్వరలోనే యూకేను దాటేస్తుందని వైద్య నిపుణులు అంచనావేస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం యూకేలో ప్రస్తుతం 2,87,403 కేసులు నమోదయ్యాయి. దీంతో గురువారం కూడా భారత్‌లో ఇదేస్థాయిలో కేసులు నమోదైతే యూకేను దాటేస్తామని […]
ముంబై: దేశంలో కరోనా కల్లోలం మొదలవుతున్న రోజుల్లో.. ఘనాకు చెందిన ఓ ఫుట్ బాలర్ స్వదేశానికి వెళ్లడానికి చాలా పెద్ద సాహసమే చేశాడు. రైల్లో త్రిస్సూర్ నుంచి ముంబైకి వెళ్లి విమానాశ్రయానికి చేరుకున్నాడు. కానీ అంతర్జాతీయ విమానాలు బంద్ అని తేలడంతో ముంబై విమానాశ్రయం టెర్మినల్ పక్కన 74 రోజుల పాటు ఒంటరి జీవితం గడిపాడు. చేతిలో ఉన్న రూ.వెయ్యితో కాలం వెళ్లదీశాడు. ఆ మధ్య కాలాన్ని ఎలా నెట్టుకొచ్చాడు?పెట్టింది తిని..ప్రతి ఏడాది కేరళలో జరిగే సెవెన్ […]
మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవ్‌హాద్ ముంబై: తన నిర్లక్ష్య ప్రవర్తనే కరోనా బారినపడేలా చేసిందని మహారాష్ట్ర మంత్రి జితేంద్ర అవ్‌హాద్ అన్నారు. విల్‌పవర్, కాన్ఫిడెన్స్ తనను వ్యాధి నుంచి కోలుకునేలా చేసిందని ఆయన అన్నారు. మరో రెండురోజుల పాటు వెంటిలేటర్‌పై ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సి ఉందని, ఆ తర్వాత డిశ్చార్జ్ అవుతానని చెప్పారు. ‘బీడీఏ, డెవలపర్స్ బాడీ’ ఏర్పాటుచేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రి ఈ విషయాలు చెప్పారు. ‘నా నిర్లక్ష్యం వల్లే కరోనా సోకింది. నేను జాగ్రత్తలు […]
ప్రకటించిన శివసేన ముంబై: మహారాష్ట్ర గవర్నమెంట్ ఎప్పటికే స్ట్రాంగ్ అని, ఎన్సీపీ, శివసేన మధ్య ఎలాంటి గొడవలు లేవని శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. తమ ప్రభుత్వంలో ఎలాంటి గొడవలు లేవని, స్ట్రాంగ్‌గా ఉందని ట్వీట్ చేశారు. ‘మాతోశ్రీలో శరద్‌పవార్, సీఎం ఉద్ధవ్ థాక్రే ఇద్దరు భేటీ అయ్యారు. వాళ్ల మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఇద్దరు దాదాపు గంటన్నర పాటు మాట్లాడుకున్నారు. కొంత మంది కడుపుమంటతో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం […]
మహారాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు పుణె: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో జైళ్లలో రద్దీని తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం 7,200 మంది ఖైదీలను రిలీజ్ చేసింది. మరో 10వేల మందిని రిలీజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు. వాళ్లందరినీ టెంపరరీ బెయిల్, పెరోల్ మీద పెట్టారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ నిర్ణయం ప్రకారం ఏడేళ్ల వరకు శిక్షపడ్డ ఖైదీలను టెంపరరీగా వదిలిపెట్టామన్నారు. ‘లాక్ డౌన్‌కు ముందు రాష్ట్రంలోని 60 […]
సారథి న్యూస్, ఆదిలాబాద్: బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఓ వృద్ధురాలి అంత్యక్రియలు నిర్వహించారు. మహారాష్ట్రలోని పుసద్ కు చెందిన కళావతి శేశరావ్ ఢగే(65) ఆదిలాబాద్‌లోని ఓ జిన్నింగ్ మిల్లులో పనిచేస్తోంది. ఆమె మృతిచెందడంతో మానవతా హృదయంతో అంత్యక్రియలు నిర్వహించినట్లు సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తెలిపారు.
ఆవిష్కరించిన మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై: మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ కేసులను గుర్తించేందుకు పెద్దసంఖ్యలో టెస్టింగ్ లు నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఓ మొబైల్ కరోనా వైరస్ టెస్టింగ్ బస్సును రూపొందించింది. ఈ బస్ ను మహారాష్ట్ర హెల్త్ మినిస్టర్ రాజేశ్ తోపే, ఎన్విరాన్ మెంట్ మినిస్టర్ ఆదిత్యఠాక్రే, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ (బీఎంసీ) ప్రవీణ్ పర్దేశీ శనివారం ఆవిష్కరించారు. బస్సులోనే టెస్టింగ్స్ […]