హన్వాడ– మహబూబ్ నగర్లో మధ్య ఏర్పాటు మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వెల్లడి సారథి న్యూస్, మహబూబ్ నగర్: వెయ్యి ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌ను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, హన్వాడ– మహబూబ్ నగర్లో మధ్యలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ వివరించారు. శుక్రవారం మహబూబ్ నగర్ కలెక్టరేట్లోని రెవెన్యూ మీటింగ్ హాల్లో అధికారులతో సమీక్షించారు. ప్రతి నియోజకవర్గంలో 20 ఎకరాల్లో రెండు గోదాములను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. రైతులు నకిలీ విత్తనాలు కొని నష్టపోకూడదని సూచించారు. నియంత్రిత […]
సారథి న్యూస్, మహబూబ్ నగర్: పిడుగుపాటుకు గురై ఇటీవల మరణించిన కుటుంబానికి మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శుక్రవారం రూ.40వేల చెక్కు, ఇతర సరుకులను అందజేశారు. మహబూబ్ నగర్ రూరల్ మండలం మాచన్ పల్లి పంచాయతీ పరిధిలోని రోళ్లగడ్డతండాకు చెందిన భీమ్లా నాయక్, సరోజ దంపతులు గతనెల 28న పిడుగుపాటుకు గురై చనిపోయారు. మంత్రి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
సారథి న్యూస్, మహబూబ్ నగర్: కరోనా వేళ పేదలను ఆదుకోకుండా కార్పొరేట్ కంపెనీలకు రుణాలు మాఫీచేయడం ఏమిటని సీపీఐ మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి పరమేష్ గౌడ్ విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు.అంతకుముందు మే డే వేడుకల్లో పాల్గొన్నారు. జర్నలిస్టులకు రూ.15వేలు ఇవ్వాలని, పేదలకు నేరుగా రూ.1500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మకాం రామ్మోహన్, బాలకిషన్, విల్సన్, హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు.
సారథి న్యూస్, మహబూబ్ నగర్: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అధికారులు ఆదేశించారు. పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని, వినకపోతే కాంట్రాక్ట్ షిప్ రద్దుచేయాలని సూచించారు. గురువారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావుతో కలిసి కలెక్టరేట్ లో నేషనల్ హైవే, ఆర్అండ్ బీ, మున్సిపల్, పంచాయతీ రాజ్, హౌసింగ్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో సమష్టి కృషితో కరోనాను నియంత్రించామని చెప్పారు. మున్సిపల్ సిబ్బంది, […]
సారథి న్యూస్, మహబూబ్ నగర్: మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన వట్టెం ప్రేమలత అనే మహిళ(35) ప్రమాదవశాత్తు బావిలో పడి చనిపోయింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. బావిలో పడిన సమయంలో ఆమెను స్థానికులు కాపాడేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది. కాగా, మృతురాలి భర్త ఆరేళ్ల క్రితమే చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.
సారథి న్యూస్, మహబూబ్‌నగర్: కరోనా సమయంలో పేదలను ఆదుకునేందుకు వివిధ సంస్థలు, వ్యక్తులు, ఉద్యోగులు ముందుకు రావడం అభినందనీయమని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. ఆదివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సుబ్రమణ్య కాలనీ, పాలకొండతండా ప్రాంతాల్లో సరుకులు పంపిణీ చేశారు. కష్టకాలంలో వలస కూలీలను ఆదుకోవాలనే సంకల్పంతోనే వారికి బియ్యం, కూరగాయలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పట్టణంలోని మెట్టుగడ్డ వద్ద ఉన్న ఆర్వీఎం భవనం ఎదుట బహుజన తరగతుల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పేదలకు […]