Breaking News

KOHEDA

ఆస్పత్రుల్లో వైద్యం కరువు

– కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి సారథి, సిద్దిపేట ప్రతినిధి: కరోనా వైరస్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని యువజన కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు బీనవేని రాకేష్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రుల్లో సరైన సౌకర్యలు లేక వైద్యమందక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తే పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. మండల గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి రోజుకు 30 కరోనా […]

Read More
మోయతుమ్మెద వాగులో యువకుడి డెడ్​బాడీ

మోయతుమ్మెద వాగులో యువకుడి డెడ్​బాడీ

సారథి న్యూస్, హుస్నాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీవర్షాలకు చెరువులు, కుంటలు అలుగులు పారుతున్నాయి. రేణుకా ఎల్లమ్మ వాగు, పిల్లివాగు, మోయతుమ్మెదవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ శివారులో ప్రవహిస్తున్న మోయతుమ్మెద వాగులో గురువారం సాయంత్రం గుర్తుతెలియని ఓ యువకుడి డెడ్​బాడీ కొట్టుకువచ్చినట్లు తెలిపారు. కొట్టుకొచ్చిన మృతదేహాన్ని వెలికితీయడంతో పాటు పోలీసులకు సమాచారం అందించినట్లు స్థానికులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More
పోచమ్మగుడిలోకి గుడ్డెలుగు

పోచమ్మగుడిలోకి గుడ్డెలుగు

సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా కొహెడ మండలం పెద్దసముద్రాల గ్రామంలోని పోచమ్మ గుడిలో ఎలుగుబంటి ప్రవేశించడం ఆసక్తిరేపింది. శుక్రవారం రాత్రి ఎస్సీ కాలనీ సమీపంలో ఉన్న పోచమ్మ ఆలయంలోకి గుడ్డెలుగు ప్రవేశించగానే గ్రామస్తులు గుడిగేట్లను మూసి తాళం వేశారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గుడ్డెలుగు సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నామని గ్రామస్తులు, రైతులు వ్యక్తం చేస్తున్నారు.

Read More
కోహెడలో ఫ్రూట్ మార్కెట్ రెడీ

కోహెడలో ఫ్రూట్ మార్కెట్ రెడీ

సారథి న్యూస్, రంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడ గ్రామంలో నూతనంగా ఫ్రూట్ మార్కెట్ ను ఏర్పాటుచేసింది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో కొత్తపేటలోని గడ్డి అన్నారం మార్కెట్ ను యుద్ధప్రతిపాదికన కోహెడకు తరలించారు. ఇక్కడ జరుగుతున్న మార్కెట్ నిర్మాణ పనులను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ […]

Read More