Breaking News

kodere

ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు

ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఇంటర్వ్యూలు

సారథి, కోడేరు: నాగర్​కర్నూల్​ జిల్లా కోడేరు మండలంలోని నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శంకర్ నాయక్ తెలిపారు. మండలంలోని కోడేరు, తీగలపల్లి, జనంపల్లి, బావాయ్ పల్లి, నాగులపల్లి, ముత్తిరెడ్డిపల్లి, పసుపుల గ్రామాల అభ్యర్థులు తమ తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకుని బుధవారం ఎంపీడీవో ఆఫీసుకు 11 గంటలకు హాజరుకావాలని సూచించారు. అలాగే రేమద్దుల, సింగోటం, కల్వకోలు బ్యాంకు ఖాతాదారులు 24వ తారీఖున హాజరుకావాలని ఆయన సూచించారు.

Read More
‘దండుపాలెం బ్యాచ్’ అరెస్ట్

‘దండుపాలెం బ్యాచ్’ అరెస్ట్

సారథి, కొల్లాపూర్: ‘దండుపాలెం బ్యాచ్’ పేరుతో జుట్టు పెంచి సినిమాలో మాదిరిగా గంజాయి, మద్యం తాగి గ్యాంగ్ గా మారి కర్రలు, రాళ్లతో దాడులుచేస్తూ గ్రామస్తులను భయాందోళనకు గురిచేస్తున్న కొంతమంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి కథనం.. నాగర్ కర్నూల్ జిల్లా కోడేర్ మండలం రాజాపురంలో 8మంది యువకులు గ్రామంలో చీకటిపడగానే మద్యం సేవించి రోడ్లపై తిరుగుతూ, వాహనదారులు, బాటసారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ‘మేము దండుపాలెం బ్యాచ్ రా.. శవాలను లేపుతాం […]

Read More