Breaking News

KODADA

అంత్యక్రియలకు ఆమడదూరం

సారథి న్యూస్​, కోదాడ : సూర్యాపేట జిల్లా సాలార్​జంగ్​పేటకు చెందిన వ్యక్తి కరోనా పాజిటివ్​ రావడంతో కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరాడు. కానీ పరిస్థితి విషమించి సోమవారం ఆస్పత్రిలోనే చనిపోవడంతో అతడి మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి బంధువులు ముందుకు రాకపోవడంతో మునిసిపల్ కమిషనర్ ఆదేశానుసారం అధికారులు, సిబ్బంది సహాయంతో రాత్రి 8 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్​స్పెక్టర్ దండు శ్రీను , హెల్త్ అసిస్టెంట్ మేరిగ అశోక్, జవాన్లు సిబ్బంది […]

Read More

జూలై 3న మహాధర్నా

సారథిన్యూస్​, కోదాడ: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 3న తలపెట్టిన ఐక్య కార్మిక సంఘాల ధర్నాను జయప్రదం చేయాలని కార్మికసంఘాల నాయకులు పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా కోదాడలో ఐక్యకార్మిక సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల శ్రీనివాసరావు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు ఎం ముత్యాలు ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు ఉదయగిరి, ఐఎన్టీయూసీ నాయకులు కే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Read More

కోదాడలో తొలి కరోనా

సారథిన్యూస్​, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడలో తొలి కరోనా కేసు నమోదైంది. పట్టణానికి చెందిన ఓ యువకుడు హైదరాబాద్​లో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా పనిచేస్తున్నాడు. ఈ నెల 11న ఓ వివాహవేడుకలో పాల్గొనేందుకు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వెళ్లాడు. రెండ్రోజుల పాటు అక్కడే ఉన్నాడు. పెళ్లి నుంచి వచ్చినప్పటి నుంచి అస్వస్థతతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతడికి వైద్యపరీక్షలు చేయగా కరోనా పాజిటివ్​గా తేలింది. దీంతో అతడిని సూర్యాపేట దవాఖానకు తరలించారు. కాగా ఆ యువకుడి ప్రైమరీ కాంటాక్ట్​లను […]

Read More