సారథి, వెల్దండ: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డీ-82 కాల్వలో నష్టపోయిన తన భూమికి నష్టపరిహారం ఇప్పించాలని నాగర్ కర్నూల్ ఎంపీ పి.రాములుకు బాధిత రైతు బొక్కల శ్రీను వినతిపత్రం అందజేశాడు. మంగళవారం వెల్దండకు వచ్చిన ఆయనకు సదరు రైతు కలిసి సమస్యలను వినతిపత్రంలో విన్నవించాడు. సంబంధిత అధికారులతో మాట్లాడి భూనష్టపరిహారం అందేలా చూస్తానని హామీఇచ్చారు.
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(కేఎల్ఐ)లో భాగమైన గుడిపల్లి లిఫ్ట్ -3 నుంచి ఆదివారం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. దీంతో కృష్ణాజలాలు కాల్వల వెంట పరుగులు తీశాయి. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ పద్మావతి, కలెక్టర్ ఎల్ శర్మన్, సర్పంచ్‌లు, […]