నాగర్‌కర్నూల్ పోలీసులకు ఓ యువకుడికి ఫిర్యాదు సామాజికసారథి, నాగర్‌కర్నూల్: తనపై అకారణంగా దాడిచేసి హత్యాయత్నం చేసి తీవ్రంగా గాయపరిచిన వారిపై చర్యలు తీసుకోవాలని ఓ యువకుడు మంగళవారం నాగర్ కర్నూల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి కథనం మేరకు వివరాలు.. నాగర్‌కర్నూల్ సంజయ్‌నగర్ కాలనీకి చెందిన జాజుల రాజ్‌కుమార్ అనే యువకుడు స్థానిక ఆనంద నిలయం హాస్టల్ వద్ద నిలిచి ఉన్నాడు. అక్కడికి కార్తీక్ అనే వ్యక్తి కారులో (టీఎస్ 31 ఎఫ్0011) వచ్చాడు. ఇదిలాఉండగా, కార్తీక్ […]
కశ్మీర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజేపీ నేతను కాల్చిచంపారు. జమ్ముకశ్మీర్‌లోని బందిపోర్‌లో బీజేపీ నేత వసీమ్ కుటుంబం నివాసం ఉంటున్నది. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో బీజేపీ నేత కుటుంబం ఓ దుకాణం వద్ద కూర్చొని ఉన్నది. ఇదే అదనుగా భావించిన ఉగ్రమూకలు అక్కడికి చొరబడి బీజేపీ నేత వసీమ్, అతడి తండ్రి బషీర్, సోదరుడు ఉమర్ బషీర్‌పై కాల్పులు జరిపారు. ఆ దుకాణం పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో ఉన్నది. సమాచామందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని […]
సారథిన్యూస్, గోదావరిఖని: కల్లు తీసేందుకు వెళ్లిన ఓ గీతకార్మికుడికి.. మోకు మెడకు చుట్టుకొని ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గుర్రంపల్లి గ్రామంలో విషాదం నింపింది. గుర్రంపల్లికి చెందిన మామిడి రాజు ప్రతిరోజు మాదిరిగానే కల్లు తీసేందుకు మోకు సాయంతో తాటిచెట్టు ఎక్కాడు. ఈ క్రమంలో మోకు.. మెడకు చుట్టుకున్నది. దీంతో ఉపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన తోటి గీతకార్మికులు మృతదేహాన్ని చెట్టుపైనుంచి కిందకు దించారు.