సారథిన్యూస్, తిరుపతి: వెఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఇటీవల భూమన కరుణాకర్‌రెడ్డి కరోనాపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. కోవిడ్ సమన్వయ కమిటీ చైర్మన్‌గా ఉన్న భూమన.. కరోనా బారిన పడి మృతిచెందిన వారికి స్వయంగా అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు భూమన త్వరగా కోలుకోవాలని వైసీపీ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.