యాప్‌ను లాంచ్ చేసిన సీఎం కేజ్రీవాల్ న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని హాస్పిటల్ బెడ్స్, వెంటిలేటర్లు, కరోనా పేషంట్ల సమాచారం తదితర అంశాలను తెలుసుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం కొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ‘ఢిల్లీ కరోనా’ పేరుతో రూపొందించిన యాప్‌ను సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. దేశ రాజధానిలో కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలకు సమాచారం ఇచ్చేందుకు దీన్ని రూపొందించినట్లు అధికారులు చెప్పారు. ‘ప్రతి ఒకరికి హాస్పిటల్స్, బెడ్లు, వెంటిలేటర్ల సమాచారం ఇచ్చేందుకు మేం యాప్‌ను లాంచ్ […]
సారథి న్యూస్, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు శనివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,525కు చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 33 మరణాలు నమోదైనట్లు హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కరోనా నుంచి కోలుకుని 441 మంది డిశ్చార్జ్ కాగా, 1,051 మంది కరోనా వ్యాధి బాధితులు చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. కర్నూలులో కొత్తగా 25, కృష్ణా జిల్లాలో 12, నెల్లూరు జిల్లాలో ఆరు, […]
సారథి న్యూస్, విజయనగరం: కరోనా వైరస్ కట్టడికి ప్రజలు, అధికారులు, పాలకుల సంయుక్త పోరాటంతో జిల్లా గ్రీన్ జోన్‌లో ఉందని ఆంధ్రప్రదేశ్ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం విజయనగరం కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనా రాకుండా ఇప్పటివరకు సురక్షితంగా ఉన్నామని, భవిష్యత్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగేలా చూడాలని అధికారులను కోరారు. జూలై 8న పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి చర్యలకు ఉపక్రమించింది. ప్రజలను అవగాహన కల్పించి మహమ్మారికి అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి అరుణ్ భరోక నేతృత్వంలో కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల అధికారుల బృందం ఆదివారం హైదరాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించింది. మొదట మెహిదీపట్నం రైతు బజార్‌ను సందర్శించింది. రైతు బజార్‌లో నిత్యావసర వస్తువులను విక్రయిస్తున్న కిరాణ షాపును పరిశీలించి అమ్మకాల గురించి షాపు యజమానితో మాట్లాడారు. […]
సారథి న్యూస్, రంగారెడ్డి : లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేసి మానవత్వంతో ఆదుకోవాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం హయత్ నగర్ డివిజన్ లోని ద్వారకమైనగర్ కాలనీకి చెందిన 70 కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పరిశుభ్రత, భౌతిక దూరం పాటిస్తే కరోనాను నిర్మూలించవచ్చని సూచించారు. నిరుపేదల బాధలను తెలుసుకుని వారికి నిత్యావసర సరుకులు […]