Breaking News

JAIBHEEM YOUTH

ప్రభుత్వానికి ‘జైభీమ్​యూత్’​ విజ్ఞప్తి

ప్రభుత్వానికి ‘జైభీమ్​ యూత్’​ విజ్ఞప్తి

సారథి, హైదరాబాద్: రాష్ట్రాన్ని వణికిస్తున్న కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి అందరికీ అన్ని కార్పొరేట్​ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందించాలని జైభీమ్​యూత్​ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా సెకండ్​వేవ్​తీవ్రతలో జనం పిట్టల్లా రాలిపోతున్నారని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్, వెంటివేషన్​సరిపడా దొరకడం లేదని పేర్కొన్నారు. అత్యవసర సమయంలో కొవిడ్​రోగుల ప్రాణాలు నిలిపే రెమిడెసివర్​ఇంజక్షన్ల కొరత తీవ్రత ఉందని, బ్లాక్ మార్కెట్​ దందాపై ఉక్కుపాదం […]

Read More
‘చలో కలెక్టరేట్’ వాయిదా

‘చలో కలెక్టరేట్’ వాయిదా

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: వంగూరు మండలం డిండిచింతపల్లికి చెందిన నిరుద్యోగ పట్టభద్రుడు, గురుకుల పూర్వవిద్యార్థి సూగూరు రామచంద్రం హోటల్​ను కూల్చివేసిన దుండగులను శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేస్తూ జనవరి 11న నిర్వహించతలపెట్టిన ‘చలో కలెక్టరేట్’​ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు జైభీమ్ యూత్ ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమాజంలోని అన్నివర్గాలు, సామాజిక ఉద్యమ సంఘాల మద్దతును దృష్టిలో ఉంచుకుని, అందరినీ కలుపుకుని ఈ పోరాటాన్ని ముందుకు […]

Read More
తీన్మార్ ​మల్లన్నపై దాడిని ఖండిస్తున్నాం

తీన్మార్ ​మల్లన్నపై దాడిని ఖండిస్తున్నాం

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రముఖ జర్నలిస్టు తీన్మార్​మల్లన్నపై దాడిని ఖండిస్తున్నామని జైభీమ్​యూత్​ఇండియా వ్యవస్థాపక అధ్యక్షుడు ముకురాల శ్రీహరి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రశ్నించే గొంతుకలపై దాడి సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలపై తీన్మార్ ​మల్లన్న ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రజలకు సమాధానం చెప్పలేనివారే దాడులకు పాల్పడుతారని విమర్శించారు. ఇలాంటి చర్యలు మానుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇలాంటి అనైతిక పనులు మానుకోకపోతే ప్రజలే బుద్ధిచెబుతారని అన్నారు. మల్లన్నపై దాడిచేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని […]

Read More